Home » వన్డే క్రికెట్ చనిపోతుంది అంటున్న అశ్విన్…!

వన్డే క్రికెట్ చనిపోతుంది అంటున్న అశ్విన్…!

by Azhar
Ad

మొదట్లో క్రికెట్ లో కేవలం టెస్టులు ఉండేవి. తర్వాత వన్డేలు.. ఆ తర్వాత టీ20లు వచ్చాయి. దాంతో ఆ చివరి పొట్టి ఫార్మటు కు ఆదరణ పెరిగింది. ఆ కారణంగా టెస్ట్ క్రికెట్ అనేది చనిపోతుంది అని అనేవారు. కానీ ప్రతి ఆటగాడు.. అలాగే క్రికెట్ బోర్డు టెస్టులకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నారు. ఐసీసీ కూడా ఆ దారిలోనే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ అనేది పెట్టింది. అయితే భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో కొత్త మాటను తీసుకువచ్చాడు. తాజాగా అశ్విన్ వన్డే క్రికెట్ చనిపోతుంది అని కామెంట్స్ చేసాడు.

Advertisement

అయితే ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ ఎలా సాగిందో అందరికి తెలుసు. ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 110 పరుగులు చేయగా.. ఇండియా 18 ఓవర్లలో దానిని చేధించింది. అంటే రెండు జట్లు కలిపి కనీసం 50 ఓవర్లు ఆడలేదు. మ్యాచ్ మొత్తం వన్ సైడ్ జరిగిపోయింది. ఈ మధ్యే ఎక్కువగా ఇలానే జరుగుతుంది. దాంతో ఇలాంటి మ్యాచ్లను ఉద్దేశిస్తూ అశ్విన్ మాట్లాడుతూ.. వన్డే క్రికెక్ అనేది కనిపించకపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యే అందరూ టెస్ట్, టీ20లు ఆడుతూ వన్డేలను తగ్గిస్తున్నారు. చాలా తక్కువ 50 ఓవర్ల మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఆ జరిగేవి కూడా వన్ సైడ్ అయిపోతున్నాయి.

Advertisement

అసలు వన్డే క్రికెట్ యొక్క బ్యూటీ ఏంటంటే ఆధిపత్యం. మొత్తం 100 ఓవర్లతో జరిగే ఈ మ్యాచ్ లో ఆధిపత్యం అనేది జట్ల చేతులు మారుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఈ వన్ సైడ్ మ్యాచ్ లు కూడా ఫ్యాన్స్ కు ఆసక్తి అనేవి కలిగించవు. నన్ను అడిగితే 2010 లో వాడిన బాల్స్ ను ఇప్పుడు వన్డే క్రికెట్ లోకి తేవాలి. అప్పట్లో గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి బౌలర్లు ఆ బంతులతో అద్భుతాలు చేసేవారు. కానీ వారు ఇప్పుడు బడుతుంది బంతులతో ఏం చేయలేరు కావచ్చు. అయితే ఐసీసీ ఈ విషయంలో ఏదో ఒక్కటి ఆలోచించి వన్డే క్రికెట్ ను కాపాడాలి అని అశ్విన్ అన్నారు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐపై మరోసారి విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహం..!

కోహ్లీకి మద్దతుగా నిలిచిన గంగూలీ..!

Visitors Are Also Reading