కథ కాన్సెప్ట్ బాగుండాలి కానీ ఏ సినిమాను ఏ విధంగా తీసిన ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. కథ కాన్సెప్ట్ బాగా లేకపోతే ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా, ఎన్ని ప్రమోషన్స్ నిర్వహించిన సినిమా చూడ్డానికి ఎవరూ వెళ్ళరు. వెళ్ళినా నిరాశపడతారు. కథ నచ్చితే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ప్రత్యేకమైన ఉదాహరణ బలగం మూవీ.
read also : మహిళల బ్లౌజులపై సింగర్ చిన్మయి వివాదాస్పద వాక్యాలు
పూర్వకాలంలో సినిమాకి వెళ్లడానికి ఊరు ఊరంతా కలిసి వెళ్లేవారు అనేదానికి నిదర్శనం ఈ బలగం. పల్లెటూరి చావు, సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు వేణు. అయితే తెలంగాణలో సంచలన విజయం సాధించిన బలగం సినిమాపై ఆదివారం జరిగిన కానిస్టేబుల్ తుది పరీక్షలో ఓ ప్రశ్న అడిగారు.
Read Also : పైసల కోసం దిగజారిన రాశి కన్నా.. ఆ హీరోతో బెడ్ రూమ్ సీన్లకు…?
మార్చి 2023 ఓనికో ఫిలిమ్స్ అవార్డులో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది? అనే ప్రశ్న ఇచ్చి సమాధానాలుగా ఉత్తమ దర్శకుడు, ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ సంభాషణ ఆప్షన్లు ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం. ఓనికో ఫిలిమ్స్ అవార్డుల్లో బలగం మూవీకి ఉత్తమ నాటకం విభాగంలో అవార్డు దక్కింది. ఈ పురస్కారంతో సహా వేణు సినిమాకు అంతర్జాతీయంగా మొత్తం 40 పురస్కారాలు దక్కాయి. మొత్తానికి బలగం సినిమాకు ఇంకా ఆదరణ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.
read also : IPL 2023 : రోహిత్ శర్మను ఛీటింగ్ చేసిన సంజూ !