పుష్ప సినిమా కొంతమంది నటీనటులకు లైఫ్ ఇచ్చింది. ఈ సినిమాలో కొన్ని కొత్త ముఖాలు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే అలా తెలుగువారికి మొదటిసారి పరిచయమైన నటుడు డాలీ ధనుంజయ్. నిజానికి డాలీ ధనుంజయ్ కన్నడ పరిశ్రమలో ఇప్పటికే 8 సినిమాల్లో హీరోగా నటించారు. అంతే కాకుండా తన తొమ్మిదవ సినిమాలో శివరాజ్ కుమార్ కు విలన్ గా నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. మరోవైపు తెలుగులో భైరవద్వీపం సినిమా లో కూడా ధనుంజయ్ నటించారు.
Advertisement
కానీ ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే పుష్ప సినిమాతో ధనంజయ్ కి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించినా నటుడిగా ధనుంజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ డాలి ధనుంజయ్ మాట్లాడుతూ… తను ప్రతి సినిమా చేసేటప్పుడు మార్కెట్ పరిశీలిస్తానని అన్నారు. అలా కొన్ని మెళకువలు నేర్చుకున్నా అని చెప్పారు.
Advertisement
అంతే కాకుండా తాను ఇండస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు పూర్తయిందని…. ప్రతిసారీ దర్శకుల నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. తనకు చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఉందని డ్రామాలు వేసేవాడినని….. థియేటర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చానని చెప్పారు. తన కుటుంబంలో నటనారంగంలో ఎవరూ లేరని తెలిపాడు. నటుడిగా కొన్ని బౌండరీలు ఉంటాయని మాత్రం ఉండదని అన్నారు.
హీరోగా విలన్ గా నటించడానికి తాను సిద్ధమే అని అన్నారు. విలన్ గా అయితే నటన కు ఎక్కువగా స్కోప్ ఉంటుంది అని చెప్పాడు. కన్నడలో అల్లు అర్జున్ మహేష్ బాబు సినిమాలు విడుదలైనా అక్కడ ఆరోగ్యకరమైన కాంపిటేషన్ మాత్రమే ఉంటుందని చెప్పారు. ఇక త్వరలోనే తాను నటించిన కన్నడ సినిమా బడవ రాస్కెల్ తెలుగులో విడుదల కాబోతుందన్నాడు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరాడు.