Telugu News » Pushpa making video : చిత్ర యూనిట్ కు బన్నీ రిక్వెస్ట్… మొత్తం క్లీన్ చేయాల్సిందే…!

Pushpa making video : చిత్ర యూనిట్ కు బన్నీ రిక్వెస్ట్… మొత్తం క్లీన్ చేయాల్సిందే…!

by AJAY MADDIBOINA

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రంలో విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మరియు సునీల్ నటిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ లో సునీల్ విలన్ గా ఉండగా సెకండ్ పార్ట్ లో ఫహద్ ఎంట్రీ ఉండబోతుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Ads

ఇక ఈ సినిమా ట్రైలర్ ను రేపు చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సుకుమార్ ఓ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అల్లుఅర్జున్ చిత్ర బృందానికి ఓ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవుల్లో షూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడికి మనం షూటింగ్ కోసం వచ్చినప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉండేనో మళ్లీ అలాగే ఉంచుదాం… మనం తాగి పడేసిన టీ కప్స్…ప్లాస్టిక్ సామాన్లు అన్నింటిని క్లీన్ చేద్దాం అంటూ వ్యాఖ్యానించారు.

 

ఆ తర్వాత మేకింగ్ వీడియోను ప్రదర్శించారు. ఇదిలా ఉంటే డిసెంబర్ 6న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు పాటలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఒక్కో పాత్ర ఆకట్టుకునే విధంగా ఉండటంతో తో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

https://fb.watch/9Ib8JneYPW/

 


You may also like