దర్శకుడు పూరి జగన్నాత్ సినిమాలు తీయడం తో పాటూ పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ క్యాస్ట్ ను విడుదల చేస్తున్న సంగతి సంగతి తెలిసిందే. యూట్యూబ్ ద్వారా పూరీ ఈ మాటలను చెబుతున్నారు. కాగా తాజాగా పూరి జగన్నాథ్ సరికొత్త పాడ్ క్యాస్ట్ తో అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ పాడ్ క్యాస్ట్ లో అతడు తడ్కా గురించి మాట్లాడారు. తడ్కా అంటే తాలింపు…. పోపు అనే అర్థం వస్తుంది.
Advertisement
అంటే అసలు అర్థం ఏంటంటే ఆయన ప్రకారంగా ఉన్నదానికి….లేని దానికి అనవసరమైన మాటలు జోడించి మంటపెట్టే వ్యవహారం అన్నమాట. ఇక పూరి తన పాడ్ క్యాస్ట్ లో ఏమన్నారంటే….. మనం ఓ మనిషిని ఇంకో మనిషి దగ్గరకు ఏదో పనిమీద పంపిస్తాం…. అతడు తిరిగివచ్చి ఏం జరిగిందో చెప్పడు. అవతలివాడు ఏమన్నాడు తప్ప మిగతాదంతా చెబుతాడు. అసలు ఏమైందిరా అంటే మంచి రోజులు కావన్నా… నువ్వు ఎంత చేశావు వాడికి. వాడలా మాట్లాడటం నచ్చలేదు.
Advertisement
నాలుగు డబ్బులు వచ్చేసరికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నాను…. కానీ నువ్వైతే లాగిపెట్టి కొట్టేవాడివి అని చెప్పుకుంటూ పోతాడు. కానీ ఇంతకీ వాడు ఏమన్నాడో చెప్పురా అని అడిగితే చెప్పడు. ఇంకెప్పుడూ వాడి దగ్గరకు పంపించవద్దు ప్లీజ్ అన్నా.. వరస్ట్ ఫెలో వాడు. ఇలా అడిగిన దానికి సమాధానం మాత్రం ఇవ్వడు. అంటే పెనంలో ఉన్నదాన్ని ఇక్కడికి తెచ్చేలోపు మనుషులు తాలింపు వేసి తీసుకువస్తారని పూరీ చెప్పాడు. ఆ తాలింపు వల్లనే జీవితంలో సగం గొడవలు వస్తాయని అన్నారు. మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారా లేదంటే వాళ్ళ అభిప్రాయం చెబుతున్నారా అనేది గ్రహించాలని అన్నారు. డౌట్ వస్తే అడిగేయండి…. మనందరం పుట్టుకతోనే వండటం నేర్చుకున్నాం. అలఓకగా తడ్కా పెట్టేస్తాం…. ఇప్పటికైనా జరిగిందే చెప్పండి. మీ అభిప్రాయం అడిగినప్పుడు నీ మనసులో ఉన్నది చెప్పింది… లేదంటే చావండి. అంతేగాని మీరేమనుకుంటున్నారో ముందే చెప్పేయడం కుదరదు. ఏ విషయం కూడా తడ్కా లేకుండా మన దగ్గరకు రాదు. అంటూ పూరీ తన