కరోనా తర్వాత నుండి థియేటర్ లో ఓ సినిమా అనేది హిట్ కావడం.. దానికి కలెక్షన్స్ అనేవి రావడం చాలా కష్టం అయ్యింది అనే చెప్పాలి. అందుకే కొత్తగా వస్తున్న సినిమాలకు విపరీతమైన ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారు. ఎన్ని ప్రమోషన్స్ చేసిన సినిమా కథ బాగుంటేనే దానిని హిట్ చేస్తున్నారు. ఒకవేళ సినిమా అనేది బాగుంటే.. దానిని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేయకపోయినా.. అభిమానులే ప్రమోషన్స్ చేస్తున్నారు.
అలాంటి తాజా సినిమా కాంతార. కన్నడలో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమాకు తెలుగు లో ఫ్యాన్స్ స్వయంగా ప్రమోషన్స్ చేసారు అనే చెప్పాలి. అయితే ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో.. కాంతార హీరో మరియు డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి మంచి గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా పై ఇంటర్వ్యూ అనేది ఇచ్చిన రిషబ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
Advertisement
Advertisement
రిషబ్ మాట్లాడుతూ.. మొదట ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‍కుమార్ ను హీరోగా అనుకున్నాము. ఈ కథ ఆయనకు చెప్పగా.. బాగా నచ్చింది. కానీ అప్పుడు ఆయనకు ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమాలో చేయలేకపోయారు అని చెప్పాడు. అయితే గత ఏడాది పునీత్ రాజ్‍కుమార్ మరణించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఈ సూపర్ హిట్ కథలో ఆయనే హీరో అయ్యుంటే.. ఆయన క్రేజ్ కూడా కలిసి ఈ సినిమా కేజిఎఫ్ రేంజ్ లో హిట్ అయ్యేది అనడంలో సందేహం లేదు.
ఇవి కూడా చదవండి :