Home » Puneeth Rajkumar Ashwini Revanth : విధి విడదీసిన అందమైన జంట ప్రేమకథ..!

Puneeth Rajkumar Ashwini Revanth : విధి విడదీసిన అందమైన జంట ప్రేమకథ..!

by Sravya
Ad

Puneeth Rajkumar Ashwini Revanth : కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యెక్కించి చెప్పక్కర్లేదు. కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా వెలుగొందరు. పునీత్ రాజ్ కుమార్ 2021లో అకాల మరణం చెందారు. ఆయన మరణాన్ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోయింది. అయితే ఆయన చనిపోయినప్పుడు ఆయన వయసు 46 సంవత్సరాల మాత్రమే. ఈ మరణం వలన అందరికంటే ఎక్కువగా భార్య అశ్విని రేవంత్ కృంగిపోయారు. పునీత్ అశ్విని అన్యోన్యమైన వైవాహిక జీవితాన్ని గడిపేవారు. ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టం. ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు అన్నట్లుగా వాళ్ళ బంధం ఉండేది. నిజానికి వీళ్ళు గాఢమైన ప్రేమలో ఉండేవారు.

Advertisement

డిసెంబర్ ఒకటి 1999లో పెళ్లి చేసుకున్నారు అప్పటినుండి పర్ఫెక్ట్ కపుల్ గా ఉంటున్నారు ఎంతో సంతోషంగా వైవాహిక జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ అనుకోని పరిస్థితులు ఎదురవడంతో అశ్వినీకి తీరని శోకమే మిగిలింది. పెళ్ళికాకముందు చదువు పూర్తయిన తర్వాత పునీత్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా అశ్వినికి పరిచయమయ్యారు ఇద్దరు కలుసుకున్నారు రెండు మూడు సంవత్సరాల దాకా వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ నీ కొనసాగించారు తర్వాత ఒకరంటే ఒకరు ఇష్టమని తెలుసుకొని ప్రేమలో పడ్డారు. ప్రేమించుకుంటున్నట్లు చెప్పుకున్నారు. పెద్దలు సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. నిజానికి అశ్విని కుటుంబ సభ్యులు ఆరు నెలల వరకు పెళ్లికి ఒప్పుకోలేదు.

Also read:

Advertisement

పునీత్ తల్లిదండ్రులు కొంచెం సందేహించారు కూడా. పునీత్ తల్లి పార్వతమ్మ త్వరగానే ఒప్పుకున్నారు చివరికి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి పెళ్లి చేశారు. పునీత్ కుటుంబ విలువలను తెలుసుకుని వాళ్ళతో కలిసి పోవడానికి అశ్వినీకి టైం పట్టింది తర్వాత వాళ్ళల్లో ఒకరైపోయి మంచి కోడలుగా పేరు తెచ్చుకుంది. ఈమె చేసే స్వీట్లు నీ మావయ్య రాజ్ కుమార్ చాలా ఇష్టంగా తినేవారిట. అశ్విని వేరే వాళ్ళ సినిమాలు పెద్దగా చూడకపోయినా పునీత్ రివ్యూ ఇచ్చేవారట. అశ్విని బెస్ట్ క్రిటిక్స్ లో ఒకరిని పునీత్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. బతికున్న కాలంలో ఈ హీరో పిఆర్కె బ్రాండ్ ని ప్రారంభించారు. అశ్విని పునీత్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2021లో అక్టోబర్ 19న గుండెపోటుతో పునీత్ చనిపోవడం వలన అశ్విని గుండె పగిలిపోయింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading