ప్రముఖ నిర్మాత దిల్ రాజు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో ఆశిష్ రెడ్డి. మొదటి సినిమా రౌడీ బాయ్స్ సినిమాతో ఆశిష్ సంకాత్రి బరిలోకి దిగాడు. ఈ సినిమాకు హుషారు సినిమా దర్శకుడు హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. సినిమాను సొంత బ్యానర్ పై దిల్ రాజు మరియు శిరీష్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది.
Advertisement
నేడే ఈ చిత్రం విడుదల కాగా దిల్ రాజు సైతం మార్నింగ్ షోను థియేటర్ లో చూశాడు. కాగా థియేటర్ వద్ద దిల్ రాజుకు చేదు అనుభం ఎదురైంది. దిల్ రాజు నడుచుకుంటూ కార్ దగ్గరకు వెళుతుండగా అసలు ఏం ఉందని సినిమా తీశారు అంటూ ప్రేక్షకుడు ప్రశ్నించాడు. దానికి దిల్ రాజు ఘాటుగా స్పందించాడు. నీకు నచ్చితే చూడు లేదంటే లేదు. అంటూ దిల్ రాజు ఫైర్ అయ్యాడు.
Advertisement
అనంతరం సదరు ప్రేక్షకుడు మీడియాతో మాట్లాడుతూ…..సినిమా అసలు ఏం భాగోలేదని అన్నాడు. కథ కూడా లేదని చెప్పాడు. సినిమాకు దేవీ శ్రీ అందించిన మ్యూజిక్ తప్ప అన్నీ మైనస్ లే అంటూ రెచ్చిపోయాడు. అనుపమ పరమేశ్వరన్ తో మూడు లిప్ లాక్ సీన్ లు ఉన్నాయని…అనుపమ ఎన్ని కోట్లు తీసుకుందో అంటూ మండిపడ్డాడు.
హర్ష ఫస్ట్ సినిమా హుషారు బాగుందని కానీ మళ్లీ అదే పాయింట్ తో ఈ సినిమాను కూడా తీశాడని అన్నాడు. సినిమాలో నాలుగు పాటలు మూడు ఫైట్స్ ఉన్నాయని మళ్లీ ఈ సినిమాలో కూడా ఫ్రెండ్స్ ఇబ్బందుల్లో ఉండటం వారికి హెల్ప్ చేయడం అదే రొటీన్ స్టోరీని ఎన్నిసార్లు చూస్తారంటూ ప్రశ్నించాడు. ఇక ప్రేక్షకుడిపై దిల్ రాజు ఫైర్ అయ్యిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.