Home » ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ తో RTCకి పెరిగిన ఆదాయం… ఎలా అంటే..?

ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ తో RTCకి పెరిగిన ఆదాయం… ఎలా అంటే..?

by Sravya
Published: Last Updated on
Ad

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి కాంగ్రెస్ పార్టీ ఘనవిజయాన్ని అందుకుంది. డిసెంబర్ 7న తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీఎం బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఆరు గ్యారెంటీ పథకాల పై తొలి సంతకం చేశారు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ట్రాన్స్ జెండాలు, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఫ్రీగా బస్సు లో వెళ్లొచ్చు అని స్కీమ్ ని తీసుకువచ్చారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అర్హత ఉన్న వాళ్ళకి 10 లక్షలు వరకు చేయూత పథకాన్ని ప్రారంభించారు.

revanth-celebratrions

Advertisement

Advertisement

మహాలక్ష్మి పథకానికి విపరీతమైన ఆధరణ అయితే వస్తోంది మహిళలు సంతోషంలో ఉన్నారు ఉచిత బస్సు సౌకర్యం వలన ఆర్టీసీకి ఆదాయం పెరిగిందని అంతా అంటున్నారు. ఇక ఆ వివరాలను చూద్దాం… తెలంగాణ కి సంబంధించిన మహిళలు ఏదైనా ఒక ఐడి కచ్చితంగా చూపించాలి. ఒకవేళ ఐడి లేకపోతే డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కోవాలి అలా చేయకపోతే 500 రూపాయలు ఫైన్ వేస్తామని హెచ్చరికలు జారీ చేశారు అయితే ఆర్టీసీ బస్సుల్లో 13 లక్షల మేర ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు.

దాదాపు 90 శాతం మంది మహిళలే ఉంటున్నారు నిజానికి తీరని నష్టం కలుగుతుంది ఈ పథకం ద్వారా ఆర్టీసీకి. ప్రభుత్వ రియంబర్స్మెంట్ కింద భారీ ఎత్తున డబ్బులు వచ్చే అవకాశం ఉందట. గతంలో 13 నుండి 14 లక్షలు ఆదాయం రాగా ఇప్పుడు 18 నుండి 25 లక్షలు పెరిగింది. ఆర్టీసీ సిబ్బంది జీరో టికెట్ ద్వారా ప్రభుత్వానికి లెక్కలు చెప్తే దాని ఆధారంగా రియంబర్స్ పే చేస్తారు ఇలా ప్రాఫిట్ వస్తుందట. గతంలో 13 నుండి 14 లక్షలు ఆదాయం వచ్చింది కానీ ఇప్పుడు చూస్తే అది 18 నుండి 25 లక్షల దాకా పెరిగిందని తెలుస్తోంది.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading