భార్య భర్తల బంధం ఎంతో పవిత్రమైనది. పెళ్లికి ముందు ఇద్దకూ తమ కుటుంబాల పై ఆధారపడతారు. కానీ పెళ్లి తరవాత ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆధారపడటంతో పాటూ వాళ్లే ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి తమ కుటుంబం కోసం ఇద్దరూ కలిసి మెలిసి ఉండాలి. ముఖ్యంగా కుటుంబం కలిసి మెలిసి ఆనందంగా ఉండాలంటే దంపతుల మధ్య గొడవలు ఉండకూడదు. అయితే దంపతుల మధ్య గొడవలకు ఎక్కువగా పరాయివారితో అక్రమసంబంధాలు పెట్టుకోవడమే కారణం అవుతాయి.
Advertisement
దంపతులలో ఎక్కువగా భర్తలే పరాయి స్త్రీల వ్యామోహంలో ఎక్కువగా పడుతూ ఉంటారు. కాగా భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో పడితే ప్రధానంగా ఐదు సమస్యలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో పడితే మొదట ఆ కుటుంబ సభ్యుల మనశ్శాంతి దూరం అవుతుందట.
Advertisement
పెద్దలతో పాటూ ఇంట్లో జరిగే గొడవల వల్ల పిల్లలు సైతం సంతోషంగా ఉండలేరట. అంతే కాకుండా అప్పటి వరకూ ఆ కుటుంబాన్ని ఎంతో గౌరవించేవాళ్లు కూడా చులకనగా చూసే అవకాశాలు ఉన్నాయట. తరచూ కుటుంబంలో జరిగేగొడవల వల్ల బయట వ్యక్తులకు సైతం చులకన అయ్యే ప్రమాదం ఉందట.
కుటుంబానికి పెద్ద తండ్రి కాబట్టి తండ్రి ఏ బాటలో నడిస్తే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు. కాబట్టి తండ్రి ఎలాంటి తప్పటడుగులు వేయకుండా తను సన్మార్గంలో నడిచి తన పిల్లలకు మార్గదర్శిగా మారాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. తండ్రి పరాయిస్త్రీల మోజులో పడితే పిల్లల చదువులు వారి అలసరాలను సైతం పట్టించుకోవడం మానేస్తాడు. దాంతో పిల్లల కెరీర్ లు నాశనం అవుతాయని చెబుతున్నారు.