పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది. కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడు ఆచితూచి అడుగేయాలి. అయితే కొన్ని సంధర్బాల్లో పెళ్లి తరవాత జరిగే గొడవల వల్ల ఇతర కారణాల వల్ల భార్య భర్తలు విడిపోవాల్సి వస్తుంది. అంతే కాకుండా భార్య కానీ భర్త కానీ మరణిస్తే మరొకరు ఒంటరవుతారు. అలా ఒంటరిగా మిగిలిపోయినవాళ్లు జీవితాంతం అలాగే ఉండిపోకుండా కొత్త జీవితాన్ని ప్రారంభించడమే మంచిది.
ఇవి కూడా చదవండి : మీరు రాత్రి పూట అన్నం బదులు చపాతీలు తింటున్నారా..? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి..!
Advertisement
అయితే కొత్త జీవితం ప్రారంభించేముందు కూడా చాలా జాగ్రత్తపడాలి. అసలే రెండో వివాహం కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. లేదంటే ఈ సమస్యలు తప్పవని మానసిక నిపుణులు చెబుతున్నారు. రెండో వివాహం చేసుకునేటప్పుడు ఆ సంబంధం నచ్చితేనే వివాహం చేసుకోవాలట. లేదంటే మళ్లీ సమస్యలు తప్పవట.
Advertisement
అంతే కాకుండా రెండో పెళ్లి తరవాత జీవిత భాగస్వామికి కోపం వచ్చినప్పుడు గతాన్ని గుర్తు చేస్తూ అందుకే నీ భర్త లేదా భార్య వదిలేశాడు అంటూ దెప్పిపొడిచే అవకాశం ఉందట. అంతే కాకుండా ఇద్దరిలో తప్పు ఎవరిది అయినా కూడా రెండో వివాహం చేసుకున్నవారిదే తప్పు అని ఎత్తి చూపడం జరుగుతుందట. కేవలం భర్త మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా చిన్నచూపు చూస్తారట.
ఇవి కూడా చదవండి : ఏపీలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్…?
కాబట్టి రెండో వివాహం చేసుకునేవారు చాలా జాగ్రత్త పడాలని పార్ట్నర్ గురించే కాకుండా ఫ్యామిలీ గురించి చేసుకోబోయేవారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. పెళ్లికి ముందే తమ గతం గురించి మాట్లాడకూడదన ఒప్పందం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. అదే విధంగా రెండో పెళ్లి అయినప్పటికీ వయసులో ఎక్కువ భేదం ఉంటే అలాంటి సంబంధం చేసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయట.