టైం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించలేం. ప్రతి ఒక్కరూ జీవితం లో పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది పెళ్లి తరవాత వచ్చిన సమస్యలను ఎదురుకొలేక విడాకులు తీసుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకు పోతే విడాకుల వరకూ వెళ్లదు.
Advertisement
కానీ అలా జరగకపోతే విడాకులు తీసుకుని ఒకటిక్కరు దూరం అవ్వక తప్పదు. ఇక విడాకుల తరవాత కొంతమంది జీవితాంతం ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటే మరికొందరు మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోవాలని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. అయితే రెండో పెళ్లి తరవాత కూడా అనేక సమస్యలు ఉన్నాయని…జాగ్రత్తగా ఉండకపోతే మరోసారి కూడా విడాకులు అవ్వచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
అంతే కాకుండా రెండో పెళ్లి తరవాత వచ్చే కొన్ని కామన్ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. రెండో పెళ్లి తరవాత చిన్న గొడవ జరిగినా కూడా మొదటి పార్టనర్ ను గుర్తు చేస్తారట. భార్య అయితే అందుకే మీకు మొదటి భర్తతో విడాకులు అయ్యాయి… భర్త అయితే అందుకే నిన్ను మొదటి భర్త వదిలేశాడు.
ఇలాంటి పదాలను వాడుతూ అవమానిస్తారట. అయితే అలాంటి సమయం లో చాలా సహనం తో ఉంటాలని చెబుతున్నారు. ఒక వేళ అలా ఉండకపోతే మళ్ళీ విడాకులు తప్పవట. విడాకుల ముందే అన్ని అంశాలను అంటే ఆస్తులు, గతంలో జరిగిన ఏవైనా ఇబ్బందులు ఇలా అన్ని ముందే చర్చించుకోవడం మంచిదట.
Also read :
కేజీఎఫ్ సినిమాలో లాజిక్ మిస్సైన డైరెక్టర్…ఇదెక్కడి లాజిక్ నీల్ మావా అంటూ ట్రోల్స్..!