Home » నీతా అంబానీపై ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఒక్కటి చాలంటూ..!

నీతా అంబానీపై ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఒక్కటి చాలంటూ..!

by Anji
Ad

భారత కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య, క్లాసికల్ డ్యాన్సర్ నీతా అంబానీపై నటి ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు మిస్‌ వరల్డ్‌-2024 వేడుకల్లో ‘బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ హ్యుమానిటేరియన్‌’ అవార్డు అందుకున్న నీతా అంబానీకి అభినందనలు తెలుపుతూ తెగ పొగిడేసింది. ఆమె పని, ప్రవర్తన తీరు ఎంతోమందికి ఆదర్శమని, నీతా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Advertisement

Advertisement

ఈ మేరకు ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. ‘మిస్‌ వరల్డ్‌-2024 ఈవెంట్ లో ‘బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ హ్యుమానిటేరియన్‌’ అవార్డు అందుకున్న నీతా అంబానీకి అభినందనలు. ‘బ్యూటీ విత్‌ పర్పస్‌ అన్నమాటకి సరైన ఉదాహరణ నీతాగారే. నేను చూసిన మంచి మనసున్న వ్యక్తుల్లో ఆమె ఒకరు. నీతా ఎల్లప్పుడూ నవ్వుతూ ఆకర్షణీయంగా కనిపిస్తుంటారు. ఎంతో మంది జీవితాల్లో ఆమె ఆనందాన్ని నింపిన తీరు అధ్బుతం. ఏ పని చేసినా అంకితభావంతో నిర్వర్తిస్తారు. ఈ తరానికే కాదు రాబోయే తరానికి కూడా ఆమె ఆదర్శంగా నిలుస్తారు’ అంటూ తనదైన స్టైల్ లో ప్రశంసలు కురిపించింది.

ముంబై వేదికగా జరిగిన మిస్‌ వరల్డ్‌-2024 పోటీల్లో క్రిస్టినా పిస్కోవా మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకుంది. చెక్‌ రిపబ్లికన్‌ నుంచి పిస్కోవా ప్రాతినిధ్యం వహించింది. ఇక నీతా అంబానీ అధ్యక్షతన ఏర్పడిన ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ విద్యతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తోంది.

Also Read :  చిరంజీవిని మూడు నెలలు వెయిట్ చేయించా.. బాబు మోహన్ కామెంట్స్ వైరల్..!

Visitors Are Also Reading