Home » Priyamani : నా వ‌య‌సు 38..అయినా నన్ను ఆంటీ అని పిలవండి !

Priyamani : నా వ‌య‌సు 38..అయినా నన్ను ఆంటీ అని పిలవండి !

by Bunty
Ad

ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రతిఒక్క సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వారి అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక కొంతమంది ఏమో ఆ ఫోటోలను, వీడియోలను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడతారు. వాటిని చూసి చాలామంది సెలబ్రిటీలు ఫీల్ అయినప్పటికీ వారిని ఏమాత్రం పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

ఇలా ట్రోలింగ్ కు గురైన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్టర్ అనసూయ. అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. దీంతో ప్రతి ఒక్కరు ఆంటీ ఆంటీ అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు. అలా పిలవడంతో అనసూయకు చాలా కోపం వచ్చి తనదైన స్టైల్ లో ఘాటుగా స్పందిస్తూనే ఉంటుంది. ఆంటీ అని పిలిస్తే కేసు పెడతా అని చాలా సందర్భాల్లో వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో హీరోయిన్ ప్రియమణిపై కూడా ఇలాంటి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియమణి పెట్టిన పోస్టులకి కూడా ఆంటీ ఆంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Priyamani

Priyamani

దీంతో కోపం వచ్చి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. తాజాగా ప్రియమణి నలుపు రంగు డ్రెస్సులో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫోటోలకి ఓ వ్యక్తి బ్లాక్ ఆంటీ అంటూ కామెంట్ చేశారు. దీంతో కోపం వచ్చిన ప్రియమణి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు నా వయసు 38 సంవత్సరాలు. అయినప్పటికీ నేను ఇప్పటికీ హా***ట్ లుక్ లోనే ఉన్నాను. ఇప్పటికీ చాలా ఎక్కువగా కామెంట్ చేశావు. నోరు మూసుకో అని సమాధానం ఇచ్చింది. నన్ను ఆంటీ అని కామెంట్ చేయడంలో తప్పేమీ లేదు, వయసు పెరిగితే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నీకు ఎలాంటి అభ్యంతరం లేకుండా నన్ను ఆంటీ అని పిలవచ్చు అని కౌంటర్ ఇచ్చింది. దీంతో చాలామంది ప్రియమణికి చాలా కోపం వచ్చినట్టుంది అని కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading