Home » ఎన్టీఆర్ తో సినిమా అంటే భయం వేసింది అంటున్న ప్రియదర్శి..!

ఎన్టీఆర్ తో సినిమా అంటే భయం వేసింది అంటున్న ప్రియదర్శి..!

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెర్రర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన అనంతరం ‘పెళ్లి చూపులు’ సినిమాతో మరింత గుర్తింపు పొందారు. ఇకపోతే ప్రియదర్శి హీరోగా ‘మల్లేశం’ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం చాలా సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న ప్రియదర్శి తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : మ‌హేశ్, ప‌వ‌న్, ఎన్టీఆర్ ల 25వ సినిమాలో ఉన్న కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా..?

Advertisement


ఈ కార్యక్రమంలో తన వ్యక్తిగత విషయాల గురించి, అలాగే వృత్తిపరమైన విషయాలపై మాట్లాడారు. తాను ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రారంభంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తనకు జరిగిన చేదు సంఘటనల గురించి బయట పెట్టారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్ వంటి హీరోల సినిమాలలో నటించారు. వారితో నటించడం ఎలా ఉందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ మహేష్ బాబు నన్ను చూడగానే నువ్వా అంటూ ఆయన పెట్టిన ఎక్స్ ప్రెషన్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆయన తెరపై ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారని తెలిపారు.

Advertisement

Also Read : పూర్ణ పెళ్లికి ఆమె భ‌ర్త బంగారం ఎంత పెట్టారో తెలుసా..?

ఇక ఎన్టీఆర్ తో సినిమా అంటే కాస్త భయపడ్డాను. ఆయనతో కలిసి మూడు రోజులపాటు సినిమా షూటింగ్ లో పాల్గొనాలి అంటే కాస్త భయం వేసింది. అయితే ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో నాతో పాటు రిహార్సల్ చేస్తూ బాగా కలిసిపోయారు. ఇక వెంకటేష్ గారు కూడా లొకేషన్ లో ఎంత సింపుల్ గా హుందాగా కనిపిస్తారని ప్రియదర్శి హీరోల గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read : మొద‌టి సారి యాడ్ లో న‌టించిన బాల‌య్య ఎంత తీసుకున్నారో తెలుసా..? ఆ డ‌బ్బు ఏం చేశారంటే..?

Visitors Are Also Reading