కేంద్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థంగా వంద రూపాయల నాణెం మీద ఆయన బొమ్మని ముద్రించడం జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కాయిన్ ని రిలీజ్ చేశారు. సోమవారం నాడు నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది మురము విడుదల చేయడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ మనకి తెలుసు కానీ ఇప్పుడు ఆ కాయిన్ ధర ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజెన్స్.
తెలంగాణలోని మింట్ కాంపౌండ్ లో దీనిని తయారు చేయడం జరిగింది. వ్యక్తి స్మారకార్థం రూపొందించిన మొదటి కాయిన్ ఇదే. ఈ నాణెన్ని 50% వెండి అలానే 40% రాగి, ఐదు శాతం నిఖిల్, 5% జింక్ తో తయారు చేయడం జరిగింది. మంగళవారం ఉదయం 10 గంటల నుండి అమ్మకాలు మొదలయ్యాయి. మొదటి విడతగా 12 వేలు కాయిన్స్ ని ముద్రించారు. డిమాండ్ పెరిగితే ఇంకొన్ని ముద్రించాలని అనుకుంటున్నారు. ఈ నాణెం ధర 3500 రూపాయల నుండి నాలుగు వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. కావాలనుకుంటే దీనిని ప్యాక్ చేసి ఇస్తారు.
Also read:
- సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
- రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
- ప్రమాదంలో ధవన్ కెరీర్.. సేవ్ చేయడానికి ధోనీ లేడు రిటైర్మెంట్ తప్పదా…!