Home » లలిత్ మోదీ నా కెరీర్ ని అంతం చేస్తానంటూ బెదిరించారు..! షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రవీణ్ కుమార్!

లలిత్ మోదీ నా కెరీర్ ని అంతం చేస్తానంటూ బెదిరించారు..! షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రవీణ్ కుమార్!

by Srilakshmi Bharathi
Ad

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)లో చేరడం మొదట్లో తన ఉద్దేశ్యం కాదని, ఫ్రాంచైజీలో భాగం కావడానికి ఏమి కారణం అయ్యిందో తాజాగా ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందని ప్రవీణ్ కుమార్ కామెంట్స్ చెబుతాయి. భారత మాజీ మీడియం-పేసర్ ప్రవీణ్ కుమార్ లాలాన్‌తోప్‌తో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రవీణ్ మీరట్‌కు దగ్గరగా ఉన్నందున మొదట ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో చేరడానికి ఇష్టపడినట్లు వెల్లడించాడు.

Advertisement

“నేను RCB కోసం ఆడాలని అనుకోలేదు, ఎందుకంటే బెంగళూరు నా ప్రదేశానికి చాలా దూరంగా ఉంది, నాకు ఇంగ్లీష్ రాదు, మరియు అక్కడి ఆహరం నాకు ఇష్టం లేదు. ఢిల్లీ మీరట్‌కి చాలా దగ్గరగా ఉంది. అక్కడ నుంచి అప్పుడప్పుడు నా ఇంటికి వెళ్ళడానికి నాకు సులువవుతుంది అని అనుకున్నారు. కానీ, ఒక వ్యక్తి నా చేత పేపర్స్ పై సంతకం చేయించుకున్నారు. అవి కాంట్రాక్టు పేపర్స్ అని నాకు తెలియదు. వాళ్ళకి నేను ఢిల్లీ కోసమే ఆడాలని అనుకుంటున్నానని, బెంగుళూరు కోసం కాదని చెప్పాను. కానీ, లలిత్ మోడీ (అప్పటి ఐపీఎల్ కమిషనర్) ) నాకు ఫోన్ చేసి నా కెరీర్‌ను ముగించేస్తానని బెదిరించాడు” అని ప్రవీణ్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Advertisement

అదే ఇంటర్వ్యూలో, ప్రవీణ్ బాల్ ట్యాంపరింగ్ సమస్యను ప్రస్తావించాడు, ఇది ఆటగాళ్లలో ఎక్కువ కనిపించే ప్రాక్టీస్ ఇదేనని పేర్కొన్నాడు. రివర్స్ స్వింగ్ సాధించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి పాక్ బౌలర్లు తరచుగా ఇందులో పాల్గొంటారని పేర్కొన్నాడు. అందరు ప్రాక్టీస్ చేస్తారు. పాక్ బౌలర్లు కొంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారనే నేను విన్నాను. నేను బంతిని స్క్రాచ్ చేసి ఇస్తే.. దాన్ని రివర్స్ స్వింగ్ చేసే నైపుణ్యం అవతలి వారికి ఉండాలి అని.. దానిని నేర్చుకోవాలి అని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading