ఒకప్పుడు ఇండస్ట్రీలో వెలుగు వెలిగి చిన్న వయసులోనే సినిమాలకు ఈ లోకానికి దూరమైన హీరోయిన్ ప్రత్యూష. తెలుగుతోపాటు తమిళ మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది ప్రత్య్రూష. చిన్న పాత్రలతో పరిచయమై హీరోయిన్ వరకు ఎదిగింది. టాలీవుడ్ లో స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని లాంటి సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రత్యూష అర్ధాంతరంగా మరణించి ఇండస్ట్రీకి… లోకానికి దూరమయింది. ప్రత్యూష అనుమానాస్పస్థితిలో మరణించడంతో ఆమె తల్లి సరోజినీ దేవి ఇప్పటికీ న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా తాజాగా సరోజినీ దేవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేశారు.
Advertisement
ఎన్నోసార్లు కేసులో వెనక్కి తగ్గాలని భయపెడుతూ తనకు ఫోన్లు వచ్చాయని చెప్పారు. ప్రత్యూష చనిపోయిన తరవాత ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారని కానీ ఎవరు సాయం చేయలేదని చెప్పారు. సినిమా పరిశ్రమ నుండి ఉదయ్ కిరణ్, రోజా, సత్యరాజ్, వెంకట్, ప్రభు లతోపాటు పలువురు తారలు ఫోన్ చేసి పరామర్శించారని చెప్పారు. కానీ ఎవరూ తమకు సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరు సాయం చేసినా చేయకపోయినా ప్రత్యూష మరణం పై తాను పోరాడుతూనే ఉంటానని అన్నారు. ప్రత్యూష చనిపోయిన తర్వాత మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టి తనను తిట్టారని సరోజినీ దేవి తెలిపారు. ఒక మంచి పాత్రతో ఇండస్ట్రీకి పరిచయం చేసి… అమ్మ చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమంటే పోగొట్టుకుని ఒక మాణిక్యాన్ని కోల్పోయింది. జీవితంలో మళ్ళీ ఆ తల్లి ముఖం చూడను. అంటూ మోహన్ బాబు అన్నారని అలా అనే హక్కు ఆయనకు ఉందని అన్నారు.