కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు “ఉగ్రం” అనే కన్నడ సినిమాతో దర్శకుడుగా తన కెరీర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో యాష్ తో కేజిఎఫ్ చాప్టర్ 1 … చాప్టర్ 2 అనే మూవీలను తెరకెక్కించాడు.
Advertisement
ఈ సినిమాలను కన్నడ తో పాటు తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషల్లో ఒకే సారి విడుదల చేశారు. ఈ రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడంతో ఈ దర్శకుడి క్రేజ్ అమాంతం ఇండియా రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ అనే మూవీని రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడులో జరుగుతుంది.
Advertisement
ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 31వ మూవీగా రూపొందబోతుంది. మైత్రి మూవీ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించబోతోంది. ఈ మూవీ యొక్క షూటింగ్ వచ్చే సంవత్సరం మార్చి నెల నుండి ప్రారంభం కాబోతోంది.
ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీకి గాను ప్రశాంత్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీకి గాను 50 కోట్ల రెమ్యూనరేషన్ ను ప్రశాంత్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెమ్యూనరేషన్ తో ఒక భారీ బడ్జెట్ మూవీనే రూపొందించవచ్చు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.