Prasanna vadanam review : సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష ఈ సినిమాలో నటించారు. అర్జున్ వై.కె ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఎస్.చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫర్ గా పని చేసారు.
Advertisement
సినిమా: ప్రసన్నవదనం
నటీ నటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష
దర్శకత్వం: అర్జున్ వై.కె
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ:ఎస్.చంద్రశేఖరన్
రిలీజ్ డేట్: మే 3, 2024
కథ మరియు వివరణ:
ఇక స్టోరీ విషయానికి వస్తే.. ఒక ఎఫ్ఎం స్టేషన్ లో ఆర్జేగా పని చేస్తున్న సూర్య (సుహాస్) యాక్సిడెంట్లో తల్లిదండ్రులని కోల్పోతాడు. దాంతో పాటుగా అరుదైన సమస్య కూడా వస్తుంది. బలంగా తలకి గాయం అవ్వడం వలన ఫేస్ బ్లైండ్నెస్ అనే సమస్య వస్తుంది దాని వలన సూర్య ఎవరి మొహాలని గుర్తించలేడు. వాళ్ళ గొంతు కూడా గుర్తుపట్ట లేకపోతాడు. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక అర్ధరాత్రి దారుణమైన హత్య చూస్తాడు. అమృత (సాయి శ్వేత) అనే అమ్మాయిని లారీ కింద తోసిస్తారు. తోసిన వ్యక్తి ఎవరో ఫేస్ బ్లైండ్నెస్ వలన గుర్తుపట్టలేడు.
Advertisement
మరుసటి రోజు యాక్సిడెంట్ ని వార్తలులో చూసి బాధితురాలికి న్యాయం జరగాలని అనుకుంటాడు. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి జరిగిన అసలు విషయం చెప్తాడు. ఏసిపి వైదహి (రాశి సింగ్) చాలా సీరియస్ గా ఈ కేస్ ని తీసుకుంటారు సాల్వ్ చేయడానికి చూస్తారు ఈ విచారణలో ఎటువంటి నిజాలు బయటికి వచ్చాయి…? సూర్య ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటాడు..? అమృత అని ఎవరు చంపేశారు ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి.
మనకి తెలియని ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. దర్శకుడు తీసుకున్న పాయింట్ అయితే చాలా బాగుంది. సూర్య తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోవడం సూర్యకి అరుదైన సమస్య రావడం తర్వాత ఇబ్బందులు వలన పడే బాధలు ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఇంకా ఆసక్తిగా ఉంది. తర్వాత సెకండ్ హాఫ్ కూడా బాగా ఉంది ఫ్లాష్ ప్యాక్ లో వచ్చే ట్విస్ట్ ని ఎవరు ఊహించరు. నటీనటులు కూడా పాత్రలకు తగ్గట్టుగా బానే నటించారు. రాశి సింగ్ కి కూడా మంచి పాత్ర పడింది టెక్నికల్ టీం కూడా అన్నిటినీ సరిగ్గా ఉండేటట్టు చూసుకుంది ఫైట్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
కథ
నటీ, నటులు
కాన్సెప్ట్
సినిమాటోగగ్రఫీ
ఫైట్స్
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొన్ని సీన్స్
Rating: 3/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!