టాలీవుడ్ నటి సాయిపల్లవి విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. కశ్మీర్ పండిట్ ల పై జరుగుతున్న దాడులు ఆవులను తరలిస్తున్నారని చెప్పి మనుషులపై జరుపుతున్న దాడులను ప్రస్తావిస్తూ సాయిపల్లవి కామెంట్లు చేసింది. ఇక ఆ కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ విషయంలో సాయిపల్లవికి కొంతమంది మద్దతు ఇస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు.
Advertisement
దాంతో సాయిపల్లవి మరోవీడియోతో క్లారిటీ ఇచ్చింది. ఒక డాక్టర్ గా తనకు ప్రాణం విలువ తెలుసంటూ వ్యాఖ్యానించింది. అన్నింటికంటే మానవత్వమే ముక్యమని మరోసారి చెప్పింది. అయితే ఈ వీడియోపై స్పందించారు. అంతే కాకుండా సాయిపల్లవి మద్దతు ప్రకటించారు. అవును మానవత్వమే అన్నింటికంటే ముందు కాబట్టే మేము మీతో ఉన్నామంటూ ప్రకాష్ రాజ్ సాయిపల్లవికి సపోర్ట్ చేశాడు.
Advertisement
ఇదిలా ఉండగా నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి సాయిపల్లవి నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. సెలబ్రెటీలు ఏదిపడితే అది మాట్లాడకూడదని అన్నారు. దొంగతనం చేసిన వాడిని దండించడం ఒక తల్లి తన కొడుకును దండించడం రెండూ ఒకటే ఎలా అవుతాయంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సాయిపల్లవి పై ఫైర్ అయ్యారు. సాయిపల్లవి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ వివాదం ఎక్కడ వరకూ వెళుతుందో చూడాలి.