ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న సినిమా పేరు ది కాశ్మీరీ ఫైల్స్. ఈ సినిమాను ఒకప్పుడు కాశ్మీర్ లో ఉన్న కాశ్మీర్ పండితులపై ఉగ్రవాదులు జరిపిన దారుణాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి వివేక్ అగ్ని హోత్రి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను తప్పకుండా చూడాలని ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ సూచించారు.
Advertisement
అంతే కాకుండా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని ఏకంగా లోక్ సభలో ప్రకటించారు. అంతే కాకుండా బిజెపి పాలిత రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా పై ట్యాక్స్ లను ఎత్తివేశారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా చూసేందుకు ఏకంగా సెలవు కూడా ప్రకటించారు. దాంతో ఈ సినిమా ప్రతి రోజు ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది.
Advertisement
అయితే ఈ సినిమా విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని సినిమాను బ్యాన్ చేయాలని కొరేవాళ్లు కూడా ఎక్కువ మందే కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తనదైన స్టైల్ లో ఈ సినిమా పై స్పందించారు. ప్రకాష్ రాజ్ ఓ వీడియో ను షేర్ చేశారు. వీడియోలో ఓ యువకుడు….హిందువులు అందరూ ఒక్కో ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవాలి.
అప్పుడు వాళ్ళు అంటూ ఉండరు. అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఈ వీడియో కు ప్రకాష్ రాజ్…..కాశ్మీరీ ఫైల్స్ అనేది కేవలం ఒక ప్రాపగాండా సినిమా మాత్రమే….ఇది జరిగిన గాయాల్ని మానేపెస్తుందా…..లేదంటే విద్వేష బీజాలను మెదడు లో బతుతుందా అంటూ ప్రశ్నించారు. దాంతో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను కొందరు సమర్ధిస్తూ ఉండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు.