Home » Pragathi : ఏంటీ.. ప్రగతి ఆంటీ హీరోయిన్ గా చేసిందా..?

Pragathi : ఏంటీ.. ప్రగతి ఆంటీ హీరోయిన్ గా చేసిందా..?

by Bunty
Ad

కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అలా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వారిలో టాలీవుడ్ నటి ప్రగతి కూడా ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాలలో హీరోలకు తల్లి, అత్త పాత్రలు చేస్తూ ప్రగతి ఫేమస్ అయ్యింది. ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో ప్రగతి హీరోయిన్ తమన్నా తల్లిగా నటించి తన నటనతో ఆకట్టుకుంది.

Advertisement

ఇప్పటివరకు ప్రగతి చాలా సినిమాలలో నటించినప్పటికీ ఎఫ్2 సినిమాలో ఆమె కామెడీ సైతం చేసి అదరగొట్టింది. అంతే కాకుండా ఆ పాత్రకు ప్రగతి తప్ప మరెవరు న్యాయం చేయలేరు అన్న మాదిరిగా క్యారెక్టర్ లో ఒదిగిపోయింది. అయితే, నటి ప్రగతి కూడా ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన విషయం చాలా తక్కువ మందికే తెలుసు.  నటి ప్రగతి అప్పట్లో ప్రముఖ సినీ దర్శకుడు భాగ్య రాజా హీరోగా నటించిన గౌరమ్మ నీ మొగుడెవరమ్మా అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

Advertisement

అలాగే ఈ చిత్రం మలయాళం, తెలుగు భాషలలో విడుదలైంది. కానీ ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నటి ప్రగతి కొన్ని రోజులపాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో తమ వైవాహిక జీవితం పై దృష్టి సారించి ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, పెళ్లైన కొన్ని సంవత్సరాలకు ఆమె వివాహ బంధంలో మనస్పర్ధలు, విభేదాలు మొదలయ్యాయి. దీంతో ప్రస్తుతం నటి ప్రగతి తన భర్తతో వేరుగా ఉంటుంది. అలాగే తన పిల్లల సంరక్షణ బాధ్యత కూడా తానే తీసుకొని అన్ని తానై పెంచుతోంది.

READ ALSO : Sachin To Kohli : 2022లో అత్యంత ధనికమైన 10 మంది ఇండియన్ క్రికెటర్లు

Visitors Are Also Reading