సినిమా తారలపై వచ్చే చిన్న చిన్న ట్రోల్స్ ను రూమర్స్ ను వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తారు. కానీ కొన్నిసార్లు సెలబ్రిటీలపై కూడా హద్దు మీరిన రాతలు రాస్తుంటారు. అయితే అలాంటి రాతలు వారిని బాధిస్తాయి. తాజాగా తనపై వచ్చిన రూమర్స్ పై నటుడు ప్రభాస్ శ్రీను స్పందించాడు. అంతేకాకుండా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభాస్ శీను ప్రభాస్ లు అసిస్టెంట్ గా క్లోజ్ ఫ్రెండ్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
డార్లింగ్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటించి ప్రభాస్ శీను ఆకట్టుకున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం డార్లింగ్ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించిన తులసితో ప్రభాస్ శ్రీను డేటింగ్ లో ఉన్నాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ ప్రచారంపై ప్రభాస్ శ్రీను స్పందించాడు. ఆవిడతో ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు కానీ తమ మీద తప్పుగా రూమర్స్ ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Advertisement
తనకు తులసి అంటే తల్లితో సమానం అని అన్నాడు. డార్లింగ్ సినిమా షూటింగ్ సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నామని చెప్పాడు. ఆవిడ పెద్దనటి…. ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారని ప్రభాస్ శ్రీను కామెంట్ చేశారు. సినిమా షూటింగ్ సమయంలో ఏదో సరదాగా డార్లింగ్ అని పిలిచిందని… దానిని కొందరు అపార్థం చేసుకున్నారని అన్నాడు.తమపై రూమర్స్ వస్తున్నట్లు మొదట ఆవిడే మెసేజ్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రూమర్స్ గురించి మీ భార్యకు చెప్పు లేదంటే తను కూడా అపార్థం చేసుకుంటుందేమో… అని సలహా కూడా ఇచ్చిందని అన్నాడు. తన భార్య ఒక డాక్టర్ అని ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇలాంటి రూమర్స్ ఆమె నమ్మకపోగా వాటిని చూసి నవ్వుకుని వదిలేసామని వ్యాఖ్యానించాడు.