Home » Prabhas Project K: ప్రభాస్ సినిమా కు మరో టైటిల్.. “K” అంటే అసలు అర్ధం ఇదా!

Prabhas Project K: ప్రభాస్ సినిమా కు మరో టైటిల్.. “K” అంటే అసలు అర్ధం ఇదా!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో కేజ్రీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో ప్రాజెక్ట్ K ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నఈ చిత్రంపై ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ “ఆదిపురుష్” గా నిరాశపరచడంతో సాలార్ సినిమాతో పాటు, ఈ సినిమా పైనే ఆయన ఫాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయంపైనా ఫోకస్ చేస్తున్నారు.

Advertisement

ప్రాజెక్ట్ k సినిమాలో ప్రభాస్ తో పాటు దీపిక పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ తో సహా పలువురు టాప్ నటులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. వీలు చిక్కినప్పుడల్లా షెడ్యూల్ ప్లాన్ చేస్తూ.. ఇప్పటికి సగం షూటింగ్ పూర్తి చేసారు.

Advertisement

ప్రాజెక్ట్ k గురించి ఏ విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే.. ఈ సినిమా టైం ట్రావెల్ స్టోరీ తో నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో టైం మెషిన్ యుగాలను దాటి వెళ్ళిపోతుందని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఇప్పటికే 600 కోట్లకు చేరింది. ఈ సినిమాకు ప్రాజెక్ట్ K అని పెట్టడంతో అందరు ఇదే టైటిల్ అనుకున్నారు. కానీ ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని తెలుస్తోంది. ఈ k అంటే ఏమిటో తెలియాలంటే కాలిఫోర్నియాలోని సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌ వరకు వేచి చూడాలి. గతంలో K అంటే కల్కి అని అనుకున్నారు. కానీ, ఇప్పుడు “కాలచక్ర” టాక్ వినిపిస్తోంది. టైం ట్రావెల్ స్టోరీ కావడంతో “కాల చక్ర” అని పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని..

ఈ 5 చిట్కాలతో మోకాళ్ళ నొప్పుల బాధ నుంచి సులభంగా బయటపడచ్చు..!

Rainy Season: వర్షాకాలంలో అధికంగా కామెర్ల వ్యాధి.. అరటిపండు అంత ప్రమాదమా?

Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?

Visitors Are Also Reading