యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాహుబలి సినిమాతో ప్రభాస్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్ళిపోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాడు. సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. కృష్ణంరాజు ఎటువంటి ఇమేజ్ ని అయితే సంపాదించుకున్నారో ఈయన కూడా అలాంటి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని క్రియేట్ చేసుకున్నారు.
Advertisement
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు. ప్రభాస్ వాళ్ళ అమ్మానాన్నల గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు శివకుమారి దంపతులకు 1979 వ సంవత్సరం అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టారు. వాళ్ళ నాన్న అనారోగ్యం కారణంగా చనిపోయారు. ప్రభాస్ వాళ్ళ అమ్మకి ఆయన నటించిన సినిమాల్లో ఏ సినిమా అంటే ఇష్టమని అభిమానులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Advertisement
Also read:
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. ప్రభాస్ వాళ్ళ అమ్మకు ఆయన చేసిన సినిమాల్లో మిర్చి మూవీ అంటే చాలా ఇష్టమట. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్స్ మధ్య ఉండే ఎమోషన్ బాగా నచ్చాయని ప్రభాస్ వాళ్ళ అమ్మ అన్నారు. ప్రభాస్ ని ఎలాంటి క్యారెక్టర్ లో అయితే చూడాలనుకున్నామో అటువంటి క్యారెక్టర్ లోని ఈ సినిమాలో కొరటాల శివ చూపించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రభాస్ వాళ్ళ అమ్మకి ప్రభాస్ నటించిన మూవీస్ అన్నిట్లో మిర్చి సినిమా ఫేవరెట్ అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!