రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ “బాహుబలి” సిరీస్ మూవీల ద్వారా దేశవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ముఖ్యంగా బాహుబలి సిరీస్ మూవీల ద్వారా నార్త్ లో ప్రభాస్ ఇమేజ్ అమంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కు సిగ్గు ఎక్కువ అన్న విషయం మనకు తెలిసిందే. దానితో తన సినిమా ఫంక్షన్లకు తప్ప వేరే వాటికి రావడానికి కూడా ప్రభాస్ ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటాడు. ఒకవేళ వచ్చిన కూడా ఎక్కువగా మాట్లాడడు. చాలా పొదుపుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు.
Advertisement
ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా చాలా సందర్భాలలో చెప్పుకొచ్చాడు. నేను సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా మాట్లాడను… ఏమీ అనుకోకండి… నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అని ప్రభాస్ స్వయంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమా ఫంక్షన్లలో … ఇతర ఫంక్షన్లలో మాత్రమే కాకుండా ప్రభాస్ సినిమా షూటింగ్లలో కూడా కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలు వచ్చినట్లు అయితే తెగ సిగ్గుపడుతూ ఉంటాడట. అందులో భాగంగా తన సినీ కెరియర్ లో కొన్ని సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు ప్రభాస్ చాలా సిగ్గుపడ్డాడట.
Advertisement
అవి ఏమిటో తెలుసుకుందాం. ప్రభాస్ చాలా సంవత్సరాల క్రితం ప్రభుదేవా దర్శకత్వంలో పౌర్ణమి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమాలో త్రిష, చార్మి హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీలో త్రిషతో ప్రభాస్ కి ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. అందులో ప్రభాస్ షర్టు విప్పి త్రిషతో ఉండవలసిన సన్నివేశం ఒకటి ఉంటుంది. దానిని చేయమని ప్రభుదేవా చెప్పగా షర్టుతోనే చేస్తాను అని ప్రభాస్ అన్నడట.
అలా అయితే రియాల్టీగా ఉండదు సార్ అని చెప్పాడట. అయినప్పటికీ ప్రభాస్ సిగ్గుతో వినలేదట. ఆ తర్వాత ఇదే విషయాన్ని కృష్ణంరాజుకు చెప్పగా… ఆయన ప్రభాస్ ను కన్విన్స్ చేసి ఈ సీన్లో నటించేలా చేశాడట. అలాగే చక్రం మూవీలో ప్రభాస్ ఒక సన్నివేశంలో హిజ్రా పాత్రలో కనిపించాడు. ఈ సన్నివేశం చేయడానికి కూడా ప్రభాస్ చాలా సిగ్గుపడ్డాడట.