బాహుబలి సూపర్ సక్సెస్ కావడంతో ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత విడుదలైన ప్రభాస్ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేజ్ లోనే విడుదలయ్యాయి. కానీ బాహుబలి అంత సక్సెస్ సాధించలేకపోయాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న మరో రెండు సినిమాలు కూడా పాన్ ఇండియానే. అయితే ఇప్పుడు ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. అందులో రవితేజతో కలిసి నటించబోతున్నాడు అనే టాక్ ఉంది.
Advertisement
అయితే వరుస ప్లాప్స్ లో ఉన్న రవితేజను అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ సినిమాతో మళ్ళీ విజయాలు బాట పట్టించాడు. రవితేక అంధునిగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కామెడీ, యాక్షన్, లవ్ అన్ని విధాలుగా ఈ సినిమా సక్సెస్ కావడంతో దీని సీక్వెల్ కూడా తీయాలని అనిల్ అనుకుంటున్నారట. అందుకే కథను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రవితేజ తీస్తున్న సినిమాలు అన్ని పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది అని తెలుస్తుంది.
Advertisement
అయితే ఈ సినిమాలో రవితేజకు ఓ సపోర్టింగ్ రోల్ రాసుకుంటున్నాడట అనిల్. ఆ పాత్రాలో ప్రభాస్ చేస్తేనే బాగుటుంది అని భావిస్తున్నాడట. ఇక ఈ విషయం ఇప్పటికే దిల్ రాజు కూడా చెప్పగా.. తన బ్యానర్ లోనే సినిమా రాబోతుండటంతో ప్రస్తుతం ప్రభాస్ ను ఒప్పించే పనిలో ఉన్నాడట దిల్ రాజు. అయితే ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకుంటాడా అనే ప్రశ్న వస్తుండగా.. ఒకవేళ ఈ సినిమానే పాన్ ఇండియా సినిమాగా తీస్తారా అనేది తెలియదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
ఇవి కూడా చదవండి :