Home » ప్రాజెక్ట్ కె నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్..! అచ్చు ఆ హాలీవుడ్ సినిమా పోస్టర్ లా ఉందని కామెంట్స్..!

ప్రాజెక్ట్ కె నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్..! అచ్చు ఆ హాలీవుడ్ సినిమా పోస్టర్ లా ఉందని కామెంట్స్..!

by Mounika
Ad

 నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్  స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనె  నటిస్తున్నారు.  బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రాజెక్ట్ కె చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ లో, స్టార్ యాక్టర్స్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే  ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకున్నాయి. ప్రభాస్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది.

Advertisement

 శాన్ డియోగా కామిక్ కాన్ వేడుకల్లో భాగంగా యూఎస్‌ఏలో జులై 20న  (ఇండియన్ టైమ్ ప్రకారం జూలై 21) ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే  దీపిక  ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక చిత్ర యూనిట్  బుధవారం (జూలై 19) మధ్యాహ్నం రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్‌లుక్ విడుదల చేయబోతున్నామంటూ మిల్లీ సెకన్లతో సహా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. 0 నుంచి 7 వరకు అంకెలను ఎంచుకున్న మేకర్స్.. 01.23.45.67 PM (IST – ఇండియన్ స్టాండర్డ్ టైం) ఓ ఆసక్తికరమైన నెంబర్ ఫ్రేమింగ్‌తో ప్రభాస్ ఫస్ట్ లుక్ కి సంబంధించిన  టైం అనౌన్స్ చేశారు.

Advertisement

 ప్రాజెక్ట్ కే మూవీ మేకర్స్ చెప్పిన విధంగానే  టైం కంటే కాస్త లేట్‌గా లుక్ రిలీజ్ చేశారు. తెలుగు ఆడియన్స్, మూవీ లవర్స్, వరల్డ్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ కె నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్ కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ గ్లింప్లో ప్రభాస్ ఐరన్ మ్యాన్‌‌లా కనిపిస్తున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . అంతేకాకుండా ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్లో బ్యాగ్రౌండ్‌లో సూర్యుడిని చూపించారు. ప్రభాస్ హెయిర్ స్టైల్ చూస్తుంటే శివుడిని పోలినట్లు ఉందని సినీ ప్రేక్షకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కోసం ప్రేక్షకాభిమానులు వెయ్యి కళ్ళతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Visitors Are Also Reading