టాలీవుడ్ లోని మోస్ట్ బ్యాచిలర్ హీరోలలో ప్రభాస్ ఒకడు. కొన్ని ఏళ్ళ నుండి ప్రభాస్ పెళ్లి అప్పుడు ఇప్పుడు అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోలేదు. కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి చూడాలనుకున్నారు కానీ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. ఇక అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరో వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుతున్నారు.
Advertisement
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాస్ ను అభిమానులు స్టేజిపై ఉండగానే పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. అయితే ఈవెంట్ జరుగుతున్న సమయంలో హీరో ప్రభాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ మాట్లాడుతుండగా పెళ్లి ఎప్పుడు అని అభిమానులు గట్టిగా అరిచారు.
Advertisement
దాంతో ప్రభాస్ పెళ్లి ఇక్కడే తిరుపతిలోనే చేసుకుంటా… ఎప్పుడైనా అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేకలు వేస్తూ గోల చేశారు. అంతేకాకుండా ప్రభాస్ మాట్లాడుతూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇదిలా ఉంటే ఆది పురుష్ సినిమా జూన్ 16న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. జూన్ 16న విడుదలవుతున్న ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కింది. అలా భారీ అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.