ప్రస్తుతం ఇండియా లోని టాప్ హీరోల లిస్ట్ లో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమా ప్రభాస్ జాతకాన్ని మార్చేసింది. ఈ సినిమా తరవాత బాలీవుడ్ హీరోయిన్ లు దర్శక నిర్మాతలు ప్రభాస్ వెంటపడటం మొదలు పెట్టారు. ప్రభాస్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా కూడా బాలీవుడ్ దర్శకుడు హీరోయిన్ తోనే చేశాడు.
Advertisement
అయితే ప్రభాస్ సినిమా లైఫ్ గురించి అభిమానులకు చాలా విషయాలు తెలుసు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రభాస్ తన పెదనాన్న కృష్ణం రాజు వారసత్వం గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక కృష్ణం రాజు తమ్ముడికి ప్రభాస్ తో పాటు ప్రభోద్ అనే పెద్ద కుమారుడు, ఓ కూతురు కూడా ఉన్నారు.
Advertisement
ప్రభోద్ కూడా చాలా అందంగా ఉంటాడు. అచ్చం ప్రభాస్ లానే ఎత్తు పొడవు ఉంటాడు. కానీ ఆయన సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ప్రభోద్ సినిమాలకు ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు. ప్రభాస్ ప్రభోద్ ల స్నేహితులు కలిసి స్థాపించిన యూవీ క్రియేషన్స్ కు ప్రభోద్ ఫైనాన్స్ ఇస్తూ ఉంటాడు. అయితే అప్పట్లో చెక్ బౌన్స్ కేసులో ప్రభోద్ ఏడాది పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది.
ఆ సమయంలో వ్యాపారాలు కూడా లాస్ అయ్యాయి. కానీ జైలు నుండి రాగానే పడిలేచిన కెరటం లా మళ్లీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభోద్ వ్యాపార రంగం లో రాణిస్తూ కొన్ని వందల కోట్ల కంపెనీలకు యజమాని గా ఉన్నాడట. అంతే కాకుండా ప్రభాస్ కూడా తన అన్న వ్యాపారాలలో సినిమాల్లో వచ్చిన రెమ్యునరేషన్ ను పెట్టుబడిగా పెడతాడట.