టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగిన సీనియర్ నటుడు కృష్ణంరాజు సెప్టెంబర్ 11న తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం విధితమే. ఈయన మరణ వార్త టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ మానసికంగా కృంగిపోయాడనే చెప్పవచ్చు. పెద్ద దిక్కుగా అన్నీ తానై తనను తాను ముందుకు నడిపించిన పెదనాన్న లేడనే విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్ ఇప్పటికే ఆ బాధ నుంచి తేరుకోలేకపోతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇది ఇలా ఉండగా.. దాదాపు 12 సంవత్సరాల తరువాత ప్రభాస్ తన సొంత ఊరు వెళ్లాడు.
Advertisement
12 సంవత్సరాల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం సొంత ఊరు మొగల్తూరుకు వస్తున్నారని వార్త చూసి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సంస్మరణ సభకు వేలాది మంది అభిమానులతో పాఉట పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విచ్చేయనున్నారు. ఇందులో వారికి భారీగా భోజన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కృష్ణంరాజు భోజన ప్రియులు కాబట్టి ఆయన సంస్మరణ సభ కోసం భారీగా విందు ఏర్పాటు చేయించారు ప్రభాస్.
Advertisement
ఈ వంట కాల గురించి తెలిస్తే కచ్చితంగా నోరూరాల్సిందే. ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో సంస్మరణ సభ కోసం ప్రభాస్ భారీ ఎత్తున భోజనాలను సిద్ధం చేయించారు. ముఖ్యంగా అతిథులకు 6 టన్నుల మటన్ కర్రీ , 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల చందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, ఇవి కాక మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలు. 2 లక్షల బూరెలు, ఇంకా వెజ్ వంటకాలను వడ్డించారు. దాదాపు లక్ష మందికి సరిపడే వంటకాలు తయారు చేయించారు. ఇక ఈ వంటకాల గురించి నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రాజువయ్యా.. రాజు గారి విందు.. ఇలాంటివి ప్రభాస్ రాజు వల్లనే అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ వచ్చిన ప్రతీ ఒక్కరినీ భోజనం చేసి వెళ్లమని చెప్పడం విశేషం.
Also Read : వివి వినాయక్ చేసిన 5 తప్పుల వల్లనే ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా ఘన విజయం సాదించలేకపోయిందా ??
కృష్ణంరాజు సంస్మరణ సభకి పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులు తరలిరావడంతో ప్రభాస్ వారితో ముచ్చటించారు. ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరినీ భోజనం చేసి వెళ్లండి డార్లింగ్ అని చెప్పాడు. అదేవిధంగా కృష్ణంరాజు భార్య శ్యామలదేవి కూడా ప్రభాస్ అభిమానులకు అభివాదం చేశారు. ఈ తరుణంలో శ్యామలాదేవి కన్నీటి పర్యంతం చెందారు.
Also Read : తల్లి ఇందిరా దేవితో మహేష్ బాబు చిన్నప్పుడు ఇలా ఉండే వాడా..?
Also Read : ఇందిరా దేవి చివరి రోజుల్లో ఇంత నరకం అనుభవించిందా..?