ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి గురించి మరిచిపోకముందే మరొకరి మరణవార్త వినడంతో ఇంస్ట్రీలో కలకల రేపుతుంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ సమస్యలతో మృతి చెందారు. ఇటీవలే అనారోగ్య పరిస్థితి వల్ల రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా మరణించిన విషయం తెలిసిందే. ఈయన మరణాన్ని సినీ ఇండస్ట్రీ అస్సలు తట్టుకోలేకపోయింది. ఇప్పటికీ ఈయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్న తెలుగు ప్రజలకు మరోవార్త చెవిన పడింది. అదేంటో కాదు మహేష్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి ఈ లోకాన్ని విడిచి పెట్టారు. గత కొంతకాలం ఈమె అనారోగ్య సమస్యతో బాధపడినట్టు తెలుస్తోంది.
Advertisement
ఈమె మరణానికి ముందు ఏం జరిగిందంటే.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఇందిరా దేవి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తనను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు ప్రతీరోజు అక్కడ చికిత్స చేయించారు. దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నట్టు సమాచారం. నాలుగు రోజుల కిందటనే ఆసుపత్రిలో డిశ్చార్జ్ చేయగా.. అప్పటికే ఆమె పరిస్థితి కష్టంగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులతో తెలిపారట. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ నాలుగు రోజులుగా ఆమెకు పూర్తి సమయాన్ని కేటాయించారట. ఆమెకు ధైర్యం కల్పించే విధంగా తోడుగా ఉన్నారట. అయినప్పటికీ ఆమె అనారోగ్యం కుదుటపడకపోవడంతో అకస్మాత్తుగా సెప్టెంబర్ 28 ఆమె కన్నుమూశారు.
Advertisement
Also Read : వివి వినాయక్ చేసిన 5 తప్పుల వల్లనే ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా ఘన విజయం సాదించలేకపోయిందా ??
.సూపర్ స్టార్ కృష్ణకి ఇందిరా దేవి మొదటి భార్య. విజయనిర్మల రెండో భార్య. కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శని ఐదుగురు సంతానం. తొలుత మొదటి భార్య విజయనిర్మల అనారోగ్యంత మృతిచెందగా.. 2022 సంవత్సరంలో జనవరి నెలలో కృష్ణ కుమారుడు రమేష్ బాబు, సెప్టెంబర్ నెలలో ఇందిరా దేవి మరణించడం సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి బాధకరమైన విషయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందిరా దేవి మరణానికి సంబంధించిన వార్తలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు కూతురు సితార రోధించడం అందరినీ కంట తడి పెట్టిస్తుంది.
Advertisement
Also Read : ముగ్గురి మరణాలకు ఉన్న లింక్ ఒకటే.. ఘట్టమనేని ఫ్యాన్స్‌ని భయపెడుతున్న సెంటిమెంట్..!