టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మరోసారి అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఇటీవల తీవ్రజ్వరంలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ లు అన్నీ వాయిదా పడ్డాయి. ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి ఆయన షూటింగ్ లలో పాల్గొన్నారు. అయితే తాజాగా మరోసారి ఆయన అనారోగ్యం భారిన పడ్డారు అంటూ టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Advertisement
అంతే కాకుండా షూటింగ్ లకు కూడా బ్రేక్ పడిందని సమాచారం. మరోవైపు మెరుగైన వైద్యం కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభాస్ మేనేజర్ ఈ వార్తల పై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Advertisement
ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే టాప్ లో ఉన్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఆ తరవాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతే కాకుండా బాహుబలి తరవాత ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.
ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రామాయణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా కు ప్యాచ్ వర్క్ లు జరుగుతున్నట్టు టాక్. అంతే కాకుండా ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా కూడా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక వీటితో పాటూ ప్రభాస్ మారుతితో ఓ లవ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగానే పాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్ కే లో సైతం నటిస్తున్నాడు.
also read :పొలిటికల్ ఎంట్రీ కోసమే మనోజ్ పెళ్లి చేసుకున్నారా..? కౌంటర్ మామూలుగా లేదుగా..!