Home » మ‌రో సినిమా ను రీమేక్ చేయ‌బోతున్న ప‌వ‌ర్ స్టార్

మ‌రో సినిమా ను రీమేక్ చేయ‌బోతున్న ప‌వ‌ర్ స్టార్

by Bunty
Ad

టాలీవుడ్ అగ్ర క‌థ‌నాయ‌కులు ప్ర‌స్తుతం రీమేక్ సినిమాలు చేయ‌డానికే మొగ్గు చూపుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అగ్ర క‌థ‌నాయ‌క‌లు చేసిన సినిమాలు దాదాపు రీమేక్ సినిమాలే ఉన్నాయి. అందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు ఉన్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలకు తిరిగి వ‌చ్చిన నాటి నుంచి రీమేక్ సినిమాల కే ప్రీయారిటీ ఇస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే చేసిన‌ వ‌కీల్ సాబ్ అనే సినిమా రీమేక్ అని తెలిసిందే. అలాగే ప్ర‌స్తుతం వస్తున్న భీమ్లా నాయ‌క్ కూడా రీమేక్ సినిమానే. తాజా గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో సినిమా ను రీమేక్ చేయ‌బోతున్నార‌ని టాలీవుడ్ లో వినిపిస్తుంది. త‌మిళం లో ఫాంట‌సీ క‌థ తో విడుద‌ల అయిన వినోద‌య చిత్త‌మ్ అనే సినిమాను తెలుగు లోకి రీమేక్ చేస్తున్నార‌ని తెలుస్తుంది.

Advertisement

Advertisement

ఈ సినిమా ను తెలుగులో రీమేక్ చేయ‌డానికి ఒక స్టార్ డైరెక్ట‌ర్ కూడా సిద్ధం గా ఉన్నాడ‌ని స‌మాచారం. కాగ త‌మిళం లో విడుదల అయిన వినోద‌య చిత్త‌మ్ అనే ఫాంట‌సీ సినిమా సూప‌ర్ హిట్ కొట్టింది. ఈ సినిమా కు త‌మిళ న‌టుడు స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అలాగే ఈ సినిమా లో స‌ముద్ర ఖ‌ని తో పాటు తంబిరామ‌య్య ముఖ్య పాత్ర‌ల‌లో న‌టించారు. కాగ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలోనూ ఒక ఫాంటిసీ క‌థ గల సినిమా ను రీమేక్ చేసిన అనుభవం ఉంది. ఓ.. మై గాడ్ అనే సినిమా ను తెలుగు లో గోపాల.. గోపాల అని తీశారు. ఈ సినిమా లో ప‌వ‌న్ క‌ళ్యాణ్, విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించారు.

Visitors Are Also Reading