Telugu News » Blog » ఉప్పల్‌ స్టేడియానికి కరెంట్ కట్..

ఉప్పల్‌ స్టేడియానికి కరెంట్ కట్..

by Bunty
Ads

ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చీకట్లు అలుముకున్నాయి. విద్యుత్ బిల్లులు బాకీ పడడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. మూడు కోట్లకు పైగా కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో స్టేడియంలో చీకట్లు అలుముకున్నాయి. ఈ మేరకు ఉప్పల్ స్టేడియం లో కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏ డిఈ బాలకృష్ణ మంగళవారం తెలిపారు.

Advertisement

Advertisement

uppal

Advertisement

విద్యుత్ బిల్లులు చెల్లించడం లో హెచ్సీఏ అధికారులు.. నిర్లక్ష్యం ప్రదర్శించారని.. అలాగే విద్యుత్ ను యధావిధిగా వాడుకున్నారని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై గతంలోనూ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై హెచ్సీఏ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే తీర్పు విద్యుత్ శాఖ కు అనుకూలంగా రావడంతో ఎస్సై కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ బకాయిల పై ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఎలాంటి ఫలితం లేకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.