అక్ష రాజ్యాలు (జర్మనీ, ఇటలీ, జపాన్) మరియు మిత్ర రాజ్యాలు ( ఫ్రాన్స్ , బ్రటిన్ , అమెరికా, సోవియట్ యూనియన్) ల మధ్య 1939 నుండి 1945 వరకు రెండో ప్రపంచ యుద్దం జరిగింది. ఈయుద్దంలో మిత్రరాజ్యాలు గెలుపొందాయి.వీరి గెలుపులో ఆలుగడ్డలు సైతం సహాయం చేశాయి!
2వ ప్రపంచ యుద్దంలో ఆలుగడ్డలు చేసిన సహాయం ఏంటి?
అక్ష రాజ్యాల్లోని జపాన్ కు చెందిన సబ్ మెరైన్ ఫసిపిక్ మహాసముద్రంలో గస్తీ కాస్తుంది. అదే సమయంలో అమెరికా సబ్ మెరైన్ దానికి దగ్గరగా వచ్చింది., అప్పటికే అక్కడ గస్తీ కాస్తున్న జపాన్ సబ్ మెరైన్ ను గమనించిన అమెరికా నేవీ సైనికులు తమ సబ్ మెరైన్ డెక్ లోంచి ఆయుధాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
Advertisement
Also Read: Shreyas Iyer : రాహులే నా ఫేవరేట్ కెప్టెన్.. ఎవరూ అలా చేయలేదు
Advertisement
ఈ లోపే జపాన్ సైనికులు అమెరికా సబ్ మెరైన్ ను చూశారు. ఇది గమనించిన అమెరికన్ సైనికుడు తనకు అందుబాటులో ఉన్న ఆలుగడ్డలను జపాన్ సబ్ మెరైన్ లోకి విసరడం ప్రారంభించాడు. అతనికి తోడుగా మరో ఇద్దరు సైనికులు కూడా ఆలుగడ్డలను జపాన్ సబ్ మెరైన్ లోకి విసరడం ప్రారంభించారు. జపాన్ సైనికులు ఆలుగడ్డలను గ్రెనేడ్లుగా భావించి., తమ మెరైన్ లో పడిన ఆలుగడ్డలను తిరిగి ఇటువైపుగా విసరడం ప్రారంభించారు. ( అప్పటి గ్రెనేడ్లు పేలడానికి 15-20 సెకండ్ల సమయం పట్టేది)
ఈ లోపు ఆమెరికా సైనికులు తమ డెక్ లోని ఆయుధాలు తీసి జపాన్ సబ్ మెరైన్ ను పేల్చివేశారు . అలా ఈ యుద్దం, ఆ ఆలుగడ్డలు చరిత్రలో నిలిచిపోయాయి!
Also Read: అప్జనిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి.. ప్రస్తుతం ఊబర్ క్యాబ్ డ్రైవర్..!