టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ పై నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య హిందూపూర్ ఎమ్మెల్యేగా టీడీపీ నేతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు. అయితే పోసాని వైసీపీలో చేరడంతో పాటూ పార్టీ నుండి ఓ పదవిని కూడా అందుకున్నారు. కాగా రాజకీయాల నేపథ్యంలో పోసాని బాలయ్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALSO READ : రామ్ చరణ్, ఉపాసన దంపతులపై మనోజ్ చేసిన ట్వీట్ వైరల్..!
Advertisement
ఓ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ…బాలకృష్ణ ఓ గదిలో ఇద్దరిని టపీమని కాల్చాడని అన్నారు. ఎవరైనా మంచి వాళ్లు కాలుస్తారా సైకోలు కాలుస్తారా అంటూ ప్రశ్నించాడు. మనకు చట్టాలు, న్యాయం ఉన్నాయని.. బాలకృష్ణకు ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసులు పొట్టొచ్చని అన్నాడు.
Advertisement
కానీ గన్ చేతిలో ఉందని కాల్చాడని ఆ తరవాత ఒక్కరోజైనా జైల్లో ఉన్నాడా అని పోసాని ప్రశ్నించాడు. నేనిద్దరిని కాలిస్తే పోసాని అమాయకుడని వదిలేస్తారా పట్టి జైల్లో వేస్తారని కామెంట్ చేశాడు. మరి నువ్వు ఇద్దరిని కాల్చావు నిన్ను జైల్లో వేయలేదు ఎవరు మానసిక రోగి అంటూ ప్రశ్నించాడు. మీ ఇంట్లో అర్దరాత్రి వాచ్ మెన్ చనిపోయాడు.
నువ్వు పొద్దున్నే బాడీని దాటుకుంటూ షూటింగ్ కు వెళ్లావు..ఎవరైనా అడిగారా ఎవరు సైకో అనేది ఇక్కడే అర్థమైపోతుందని పోసాని వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి అంటూ బాలయ్య పై పోసాని ఫైర్ అయ్యాడు. ఇక ప్రస్తుతం బాలయ్య పై పోసాని చేసిన కామెంట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ALSO READ : రంజాన్ మాసంలో పెరుగు, యాలకులు, పుదీనా తింటే ఆ రోజంతా దాహం వేయదా?