సౌత్ ఇండస్ట్రీలో వున్న పెద్ద హీరోలలో విజయ్ దళపతి కూడా ఒకరు. విజయ దళపతి తమిళ తో పాటుగా తెలుగులోనూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. తెలుగులో కూడా ఆయనకి అభిమానులు ఎక్కువే. విజయ్ దళపతి ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ అందరికీ నచ్చింది. అలానే ఈ మూవీ గ్లిమ్ప్స్ కూడా అందరినీ బాగా ఆకట్టుకున్నాయి.
Advertisement
మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. అలానే కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన మొదటి సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఆ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ప్రస్తుతం వివాదంలో ఇది చిక్కుకుంది. ఈ పాటలో మత్తు పదార్థాలు వాడకం, రౌడీజం చూపించారు అంటూ కొందరు కోర్టుకెళ్లారు వారిలో పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియా కూడా ఉన్నారు.
Advertisement
గతంలో ఈమె విజయ్ ని టార్గెట్ చేసింది. ఎన్నో ఆరోపణలు చేసింది. తాజాగా ఇంకోసారి సెన్సేషనల్ కామెంట్లు చేసింది. విజయ్ ఫాన్స్ సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్ చేసారు. విజయ్ సినిమాలో స్మోకింగ్ వీడియోలు మీద నిరసనలు చేసినందుకే విజయ్ అభిమానులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆమె చెప్పారు.
విజయ్ సోషల్ మీడియా ఐడిని టాగ్ చేసి అసభ్యకరమైన పదజాలంతో కామెంట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇలా ఆమెని బెదిరించారని పోలీసులు విజయ్ దళపతిని అరెస్ట్ చేయాలని ఆమె అంటున్నారు. స్మోక్ చేయడం మంచిది కాదని స్మోక్ చేయడం వలన క్యాన్సర్ వస్తుందని పాటలో ఉన్నాయని ఆమె అన్నారు.
Also read:
- ఎట్టకేలకు సినిమాల నుంచి తప్పుకోవడానికి గల రహస్యాన్ని బయటపెట్టిన మధుబాల.. కారణం ఆ హీరోనే..?
- ఎన్టీఆర్ జ్ఞాపకశక్తిపై.. రాజమౌళి కామెంట్స్.. వైరల్..!
- శుక్రవారం నాడు మాత్రం అస్సలు ఈ పొరపాట్లని చెయ్యకండి.. డబ్బులన్నీ పోతాయి..!