బిగ్ బాస్ బ్యూటీ యూట్యూబర్ సరయు పై పోలీస్ కేసు నమోదయ్యింది. సరయు చేసిన ఓ షార్ట్ హిందూ సమాజాన్ని మహిళలను కించపరిచేలా ఉందంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. సరయు ఆమె టీం పై విశ్వహిందూ పరిషత్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు. దాంతో మొదట సిరిసిల్లలో కేసు నమోదు కాగా ఆ వీడియోను హైదరాబాద్ ఫిలింనగర్ లో చిత్రించినట్టు గుర్తించారు.
Advertisement
Advertisement
దాంతో ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా సరయు ఆమె టీమ్ 7ఆర్ట్స్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ లో సినిమా రివ్యూలు ఇతర షార్ట్ ఫిలింలు చేస్తుంటారు. అయితే సిరిసిల్లలో 7ఆర్ట్స్ పేరుతో ఓ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ వీడియోను గతేడాది ఫిబ్రవరిలో యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోలో సరయు ఆమె బృందం గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న బ్యాండును ధరించారు.
అంతే కాకుండా సిరిసిల్లలోని 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కు మద్యం సేవించి వస్తారన్న టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే సరయు 7ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ సీజన్ 5 లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకోకుండా వారంలోనే ఎలిమినేట్ అయ్యింది.