ఏపీలో పిఠాపురం హాట్ టాపిక్ అవుతుంది. ఏ నోట విన్నా పిఠాపురం మాట వినపడుతోంది. పిఠాపురం కాకినాడ జిల్లాలో ఉంది. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అని పిలిచేవారు. ఈ ఊరికి అధిపతి పీఠంబ కుక్కుటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో పురుగుతక దేవి ఆలయం ఉన్నది. అష్టాదశ శక్తి పీఠంలో ఇది కూడా ఒకటి. ఓంకారిణి శక్తిపీఠం ఈ కుక్కుటేశ్వర దేవాలయంలో ఈ విగ్రహం పీఠం ఇప్పుడు కనబడవు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చింది. రచయిత ర్యాలీ ప్రసాద్ పిఠాపురం చరిత్ర అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో రాణి సీతాదేవికి సంబంధించిన వివరాలు ప్రకారం పిఠాపురం రాజా కుటుంబం నుండి ఉయ్యూరు సంస్థానంలో అడుగుపెట్టిన యువరాణి పేరు సీతాదేవి. తర్వాత బరోడా సంస్థానాధీశుడిని పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లికి మత నిబంధనలు అడ్డుకోవడంతో ఇస్లాం మతంలోకి మారారు. 80 ఏళ్ల కిందటి రాణి సీతాదేవి ప్రేమ పెళ్లి వ్యవహారాలు ఆసక్తిగా ఉంటాయి.
విలాసవంతమైన జీవనం గడిపిన మహారాణిగా చరిత్రకారులు చెబుతారు. అప్పట్లోనే సొంతంగా ఎయిర్ జెట్ ఉండేది. సౌందర్యవతి కూడా. బరోడాకు చెందిన మహారాజా ప్రతాప్‌సింగ్ గైక్వాడ్ ఆ నాటికి అత్యంత ధనవంతుల్లో ఒకరు. విలాసవంతమైన జీవితం గడుపుతుండేవారు. గుర్రపు పందేల విపరీతమైన మక్కువ ఉండేది. పిఠాపురం యువరాణి సీతాదేవిని చూశారు. తొలిచూపులోనే అందానికి మైమరిచిపోయారు. ఉయ్యూరు సంస్థానానికి చెందిన రాజా మేకా వెంకయ్యప్పారావును సీతాదేవి వివాహం చేసుకుని ఉన్నారు. 1935లో వివాహం జరిగింది. అప్పటికే ఓ కొడుకు ఉన్నారు. భర్త అయిన ఉయ్యూరు రాజాతో కలిసి సీతాదేవీ రేసులకు తరచూ హాజరయ్యేవారు. హిందూమతాన్ని స్వీకరించి 1943లో ప్రతాప్‌సింగ్ గైక్వాడ్ ని పెళ్లి చేసుకున్నారు.
Advertisement
Advertisement
Also read:
Also read:
వివాహం విషయమై అప్పట్లో బ్రిటీష్ వైస్రాయ్ నుండి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చట్ట ప్రకారం తొలి వివాహం రద్దు చేసుకున్నాక ఆమెకు రెండో వివాహానికి అడ్డంకులుండవని.. రెండో వివాహం నిషేధం చట్టంపై స్పందిస్తూ రాజ్యంలోని చట్టాలకు రాజుకు మినహాయింపు ఉంటుందని వాదించారు. రేసు గుర్రాలు సహా వివిధ పందేలకు అలవాటు పడిన రాణీ సీతాదేవి భర్తతో కలిసి మాంటీకార్లో సిటీకి వెళ్లారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం రావడం, సంస్థానాలను భారత ప్రభుత్వం విలీనం చేసుకోవడంతో స్థిరపడ్డారు. మహారాజా ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌కు 1951లో భారత ప్రభుత్వం సంస్థానాధిపతి హోదాను తొలగించింది. చివరకు 1956లో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ తో సీతాదేవి విడాకులు తీసుకున్నారు.1985లో కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సీతాదేవి కుంగిపోయారు. 1989 ఫిబ్రవరి 15న సీతాదేవి కూడా మరణించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!