Home » Pindam Movie Review in Telugu : పిండం సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

Pindam Movie Review in Telugu : పిండం సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్..!

by Sravya
Ad

Pindam Movie Review in Telugu : నటుడు శ్రీరామ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. అదేనండి టాలీవుడ్ లో ఇతను ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలేవేరులె, నిప్పు, దడ, టెన్త్‌ క్లాస్ డైరీస్‌తోపాటు పలు సినిమాలతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఈసారి  శ్రీరామ్‌ హార్రర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.  ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరామ్ హీరోగా నటిస్తున్నారు. కుశీ రవి హీరోయిన్‌గా నటిస్తోంది. సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ని కళాహి మీడియా పతాకం పై యశ్వంత్‌ దగ్గుమాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత త‌దిత‌రులు నటించారు.

Advertisement

కథ మరియు వివరణ :

క్రిస్టియన్ మతానికి చెందిన ఆంథోని(శ్రీరామ్) రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పని చేస్తాడు. ఇతనికి భార్య (ఖుషి రవి), ఇద్దరు కూతుర్లు సోపి, తార. తన తల్లి సూరమ్మతో కలిసి ఓ గ్రామంలో అతి పురాతన ఇంటిని కొనుగోలు చేిస నివాసముంటాడు. ఆ ఇంట్లో చేరిన తరువాత ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడంతో గర్భిణిగా ఉన్న భార్య ఆసుపత్రిలో చేరుతుంది. తల్లి ఊహించని రీతిలో ప్రమాదానికి గురవుతుంది. అయితే పురాతన ఇంటిని ఆంథోని కొనుగోలు చేసి అక్కడే ఎందుకు ఉండాలని అనుకుంటాడు. పాత ఇంట్లో చేరిన తరువాత పిల్లలకు, కుటుంబానికి ఎదురైన సమస్యలు ఏంటి..? ఇంట్లో జరిగిన సంఘటనలతో ఆంథోని ఎలా స్పందించాడు..? ఇంట్లో క్షుద్ర శక్తులను అరికట్టేందుకు అన్నమ్మ ఏం చేసింది.  ఆంథోని కుటుంబ సమస్యల నుంచి స్నేహితులు గట్టెక్కించారా..? ఆ ఇంటిని ఆంథోని వదిలి వెళ్లాడా? ఆ ఇంట్లో చిన్న కూతురికి ఆవహించిన ఆత్మను ఎలా వదిలించారనే ప్రశ్నలకు సమాధానమే పిండం మూవీ కథ.

దర్శకుడు సాయి కిరణ్ రాసుకొన్న స్టోరీ.. ఆ కథను చెప్పడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే చాలా బాగుంది. నటీనటులు కూడా ఈ సినిమాలో తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫస్టాప్ లో ఈ సినిమాను చాలా గ్రిస్పింగ్ గా, ఎమోషనల్ గా చూపించాడు. కొన్ని సీన్లలో ప్రేక్షకులు భయాందోళనకు గురవుతారు. అందుకే ఈ చిత్ర యూనిట్ చిన్నపిల్లలు, గర్భీణీలు చూడకూడదని హెచ్చరించారు.  కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రానికి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అద్భుతమనే చెప్పాలి. ఫస్టాప్ ను పకడ్భందిగా మంచి సన్నివేశాలతో ముందుకు నడిపించిన సెకండాఫ్ ను కూడా అదేస్థాయిలో నడిపించారనే చెప్పాలి. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు కథ రోటీన్ గా అనిపించినా.. ఫ్లాష్ బ్యాక్ చెప్పిన విధానం అదుర్స్. సాయి కిరణ్ మూవీని తీసిన విధానం చూస్తే తొలి సినిమా దర్శకుడు అని ఎవ్వరూ అనరు.

Advertisement

 

నటినటుల విషయానికొస్తే.. పిండం మూవీలో డిఫరెంట్ లుక్, బాడీ లాంగ్వెజ్ తో ఆకట్టుకున్నారు. భావోద్వేగం సన్నివేశాల్లో శ్రీరామ్ నటన బాగుంది. ఆంథోని భార్యగా నటించిన ఖుషి రవి తన పాత్రలో ఒదిగిపోయారు. ఇద్దరూ చిన్న పిల్లల నటన కూడా చాలా అద్భుతమనే చెప్పాలి. ఈశ్వరిరావు డిగ్నిపైడ్ క్యారెక్టర్ లో కథను తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు అవసరాల శ్రీనివాస్ పాత్ర పరిధి తక్కువ అయినా గుర్తుండి పోతారు. రవి వర్మ పాత్ర ఈ చిత్రానికి బలంగా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ.. కథనం, ఎమోషనల్ సీన్లు, స్క్రీన్ ప్లే తో దర్శకుడు సాయికిరణ్ కట్టిపడేశాడనే చెప్పాలి. ఈ సినిమా థియేటర్ లో వీక్షిస్తే మంచి అనుభూతి కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటినటుల నటన
  • దర్శకుడు
  • స్క్రీన్ ప్లే
  • ఎమోషనల్ సీన్స్
  • ఫ్లాష్ బ్యాక్

మైనస్ పాయింట్స్ : 

  • రొటిన్ స్టోరీ
  • స్లోగా సాగడం

రేటింగ్:  2.75/5

Visitors Are Also Reading