బాల రామాయణం ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా. ఈయన 38 ఏళ్ల జీవితంలో సినీ జీవితం మొదలై నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 14, 1996లో ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా బాల రామాయణం విడుదలైంది. ఈ చిత్రం పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకనిర్మాతలు నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు.
Advertisement
ఇది ఇలా ఉంటే ఈ చిత్రం తెరకెక్కించడానికి గుణశేఖర్ చాలా తిప్పలు పడ్డాడు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో గొడవ కూడా పడ్డాడు. ఇదంతా పక్కకు పెడితే, పూర్తిగా పిల్లలతోనే తెరకెక్కిన ఈ రామాయణం సినిమా బాల రామాయణంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అలా పాతికేళ్ల తర్వాత ఈ చిత్రంలో నటించిన బాల నటులు ఎవరెవరు? వారు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుందాం.
# జూనియర్ ఎన్టీఆర్
ఈ చిత్రంలో రాముడి పాత్రలో బాల నటునిగా పరిచయమైన ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రం తర్వాత హీరోగా పరిచయమై ఇప్పటివరకు 29 సినిమాలలో నటించారు.
Advertisement
# స్మిత మాధవ్
ఈ చిత్రంలో సీత పాత్రలో నటించిన స్మిత మాధవ్ ప్రస్తుతం భరతనాట్యకారిణిగా సెటిల్ అయ్యారు.
# నారాయాణం నిఖిల్
ఈ చిత్రంలో లక్ష్మణుడి పాత్రలో నటించారు నారాయణం నిఖిల్.
# అర్జున్ గంగాధర్
ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటించారు అర్జున్ గంగాధర్.
# స్వాతి బాలినేని
ఈ చిత్రంలో రావణుడి పాత్రలో నటించింది స్వాతి బాలినేని.
# సునైనా
ఈ చిత్రంలో శబరి పాత్రలో నటించి అందరిని మెప్పించింది సునైన.
# అమ్జాద్ ఖాన్
ఈ చిత్రంలో కుంభకర్ణుడి పాత్రలో నటించారు అమ్జాద్ ఖాన్.
# శ్వేత
ఈ చిత్రంలో రావణుడి భార్య మండోదరి పాత్రలో నటించింది శ్వేత.
READ ALSO : Avatar-2 Review in Telugu : ‘అవతార్ 2’ రివ్యూ