సాధారణంగా వంకాయ కూర అంటే చాలా మంది పడి చస్తారు. చాలా ఇష్టంగా తింటారు. గుత్తి వంకాయ కూర అంటే గుటకలేసుకుంటూ తినేస్తారు. వంకాయ తినడానికి రుచిగా ఉండడంతో పాటు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొందరూ మాత్రం వంకాయ కూరను తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాదని తింటే ప్రమాదం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా దర్భదారణ సమయం వంకాయ తినవద్దని చెబుతున్నారు నిపుణులు. గర్భిణీలతో పాటు మరికొందరూ కూడా ఈ వంకాయను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వంకాయను ఎవరెవరో తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటే వంకాయతో చేసిన కూరలు తినకూడదు. కారణం ఇది గ్యాస్ సమస్యలను మరింత పెంచుతుంది. ఏదైనా ఎలర్జీ సమస్య ఉన్నట్టయితే వంకాయ తినవద్దు. ఎందుకంటే దీనిని తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. డిప్రెషన్‌తో బాధపెడుతూ మెడిసిన్స్ వాడుతున్నట్టయితే ఇతర ఆందోళనతో బాధపెడుతున్నట్టయితే వంకాయ కూరను ఉండాలి. ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది. రక్త హీనతతో బాధపడేవారు వంకాయ కూర తినకూడదు. ఇవి రక్తం పెరుగుదలకు అడ్డంకిగా పని చేస్తాయి. కారణంగా రక్తం తక్కువగా ఉన్నవారు వంకాయ తినవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement
Also Read : మీ ఇంట్లో బల్లుల భయం ఉందా..? ఈ టిప్‌తో క్షణంలో వదిలించుకోండి..!
కళ్లలో ఏదైనా సమస్య ఉన్న వారు వంకాయ కూరలకు దూరంగా ఉండాలి. కళ్లలో మంట, వాపు, దురద ఉంటే వంకాయ తినొద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. పైల్స్‌తో బాధపడుతున్నట్టయితే వంకాయను తినవద్దని సూచిస్తున్నారు వైద్యులు. దీనిని తినడం వల్ల సమస్య మరింత పెరిగే ప్రమాదముంది. కిడ్నీలో రాళ్లు ఉంటే వంకాయను అస్సలు తినకూడదు. వంకాయలో ఉండే ఆక్సలేట్స్ రాళ్ల సమస్యను మరింత పెంచుతుంది.
Also Read : నిత్యం ఈ 5 రకాల పండ్లను తీసుకుంటే మీ కొవ్వు కరిగిపోవడం పక్కా..!