Home » పవన్ కళ్యాణ్ ప్రచార రధం “వారాహి” పేరుకు అర్ధం ఏమిటి? ఈ పేరు ఎందుకు పెట్టారు?

పవన్ కళ్యాణ్ ప్రచార రధం “వారాహి” పేరుకు అర్ధం ఏమిటి? ఈ పేరు ఎందుకు పెట్టారు?

by Srilakshmi Bharathi
Ad

జనసేనాని పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలను సమర్ధవంతంగా నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు అందుకు తగ్గట్లే ప్రిపేర్ అవుతున్నట్లు ఉన్నారు. ప్రచారంలో భాగంగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ “వారాహి యాత్ర” ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఆయన ప్రజల మధ్య ఉండి, ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఈ యాత్రను సంకల్పించారు. ఈ వాహనం వీడియోను కూడా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వాహనం డిజైన్ కానీ, వాహనం పేరు కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. దీనితో అటు అభిమానులు, ఇటు జనాలలో క్యూరియాసిటీ మొదలైంది. అసలు ఈ పేరు ఎందుకు ఎంచుకున్నారు. వారాహి అంటే ఏమిటి అనే చర్చ మొదలైంది.

varahi 1

Advertisement

విష్ణుమూర్తి అవతారం వరాహ మూర్తి గురించి అందరికి తెలిసినదే. వేదాలను తీసుకెళ్లి భూమిని సముద్రం లోపల దాచేసిన హిరాణ్యాక్షుడి బారి నుంచి భూమిని రక్షించడం కోసం వరాహమూర్తిగా అవతరించిన శ్రీమహా విష్ణువు అతడిని వధించి, భూమిని వెలుపలికి తీసుకొస్తాడు. అలానే ప్రజలలో కూడా చైతన్యాన్ని తీసుకొచ్చి, అజ్ఞానం నుంచి బయటకు తీసుకురావడం కోసమే యాత్ర సంకల్పించిన జనసేనాని తన వాహనానికి వారాహి అని పేరు పెట్టారని జనసైనికులు భావిస్తున్నారు. ఈ వాహనానికి పెట్టిన పేరు వెనుక ఏ కారణం ఉన్నా.. ప్రస్తుతం ఈ టాపిక్ చర్చనీయాంశమైంది.

మరిన్ని ముఖ్య వార్తలు:

పాప ఎవరి పోలికనో చెప్పేసిన రామ్ చరణ్.. పేరు కూడా ఫిక్స్..!

తమన్నా, కోహ్లీ పర్సనల్ వీడియోలీక్.. షాక్ లో అనుష్క ?

పూరి జగన్నాథ్ తమ్ముడు ఎమ్మెల్యే అనే విషయం మీకు తెలుసా ?

Visitors Are Also Reading