అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా వారసుడు రాబోతున్నాడు. జూలై లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. చాలా కాలం నుండి రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొన్ని నెలల క్రితం ఉపాసన తాను గర్భవతి అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Advertisement
ఇక ఎప్పటికప్పుడు ఉపాసన ఆరోగ్యంపై సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇస్తూ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఉపాసనకు చాలామంది ఫ్యాన్స్ కూడా అయ్యారు. ఇక మెగా ఫ్యామిలీ కూడా ఉపాసనను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఉపాసనకు నచ్చిన వంటకాలు చేసి పెట్టడంతో పాటు కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Advertisement
అంతేకాకుండా తాజాగా పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజోనోవా ఉపాసన కోసం గిఫ్ట్ పంపారని ఫిలిం నగర్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అన్నా లెజోనోవా రష్యాకు చెందిన మహిళ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్నా లెజోనోవా రష్యా నుండి ఉపాసన కోసం మంచి పోషక విలువలు కలిగిన పండ్లను అదేవిధంగా దుస్తులను ఉపాసన కోసం పంపించారట.
ఇండియాలో దొరికే ఆపిల్, అరటి, జామ, లాంటి పండ్లను పంపించినప్పటికీ రష్యాలో వాటిలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయని సమాచారం. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పవన్ సతీమణి ఉపాసన కోసం అంత కేర్ తీసుకుంటుందా…? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంతేకాకుండా అన్నా రష్యా కు చెందిన మహిళ అయినప్పటికీ భారతీయ సంప్రదాయాలు చక్కగా పాటిస్తారని ఆమెపై పొగడ్తలు కురిపిస్తున్నారు.