Home » పుస్తకాలు అంటే పడి చచ్చే పవన్ కళ్యాణ్.. ఎంతవరకు చదివారో తెలుసా..?

పుస్తకాలు అంటే పడి చచ్చే పవన్ కళ్యాణ్.. ఎంతవరకు చదివారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

టాలెంట్ ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అని పవన్ కళ్యాణ్ ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఇండస్ట్రీలో డాక్టర్ అవ్వబోయి యాక్టర్ నయ్యానని అంటారు. అలాంటి ఇండస్ట్రీలో చదివితేనే యాక్టర్ అవ్వగలము అనేది ఏమీ లేదు. చదువుకోకుండా కూడా పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ అయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చదివారో ఇప్పుడు తెలుసుకుందాం.. కొణిదెల వెంకటరావు,అంజనాదేవిలకు జన్మించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కి ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు.

Advertisement

Also Read:Kiccha Sudeep : బీజేపీలో చేరనున్న కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌..!

ఇందులో మెగాస్టార్ చిరంజీవి నాగబాబు అంటే అందరికీ తెలిసిన వారే. అయితే పవన్ కళ్యాణ్ తండ్రి పోలీస్ శాఖలో ఉద్యోగం చేసేవారు. దీనివల్ల ఎప్పుడూ బదిలీలు అయ్యేవి. ఇలా పవన్ విద్యాభ్యాసం బాపట్లలో మొదలైంది. తర్వాత చీరాలలో కొనసాగింది. ఇక పవన్ కళ్యాణ్ తన ఇంటర్మీడియట్ నెల్లూరులోని వి ఆర్ సి కళాశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత చదువుల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో డిగ్రీ చదవలేదు. అనంతరం కంప్యూటర్ డిప్లోమా చేసి చదువులకు దూరమయ్యాడు. ఇక అప్పటినుంచి సైలెంట్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ను చూసిన చిరంజీవి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయించారు.

Advertisement

Also Read:70ఏళ్ల వ్యక్తయినా అలా చేయడానికి రెడీ.. బలగం నటి రూప లక్ష్మి కామెంట్స్ వైరల్..!!

ఆ తర్వాత అతను నటనా టాలెంట్ తో అంచలంచెలుగా ఎదిగి పవర్ స్టార్ గా ఎదిగారు. మెగాస్టార్ చిరంజీవి కంటే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు. అన్నదారి చూపిస్తే తమ్ముడు ఆ దారిని పట్టుకొని పెద్ద రహదారి వేసుకున్నాడు అని చెప్పవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేస్తూ క్రియాశీల రాజకీయాల్లో కూడా ముందుంటున్నారు. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదివే పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారంటే ఇప్పటికి ఎవరు నమ్మరు.

Also Read:కృష్ణ చెల్లిగా విజయనిర్మల 3 చిత్రాల్లో నటించిందని మీకు తెలుసా..?

Visitors Are Also Reading