Home » అన్ స్టాపబుల్ షోకి పవన్ వేసుకున్న బ్లాక్ హుడీ ధర ఎంతో తెలుసా ?

అన్ స్టాపబుల్ షోకి పవన్ వేసుకున్న బ్లాక్ హుడీ ధర ఎంతో తెలుసా ?

by Bunty

బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కి ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీలు వచ్చి అభిమానులను మెస్మరైజ్ చేశారు. ఈ తరుణంలో ఈ టాక్ షో కి మంగళవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వేలాది మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేశారు. వేలాది మంది అభిమానుల మధ్య ఈలలు వేస్తూ, కేకల నడుమ కారు దిగివచ్చి పవన్ కళ్యాణ్, బాలకృష్ణను హాగ్ చేసుకున్నారు.

ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసిన నందమూరి మరియు మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ బ్లాక్ హుడి ధరించి, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్ ధరించిన ఈ బ్లాక్ హుడి ధర ఎంత ఉంటుంది అని పెద్ద ఎత్తున నెటిజన్స్ ఆరతియడం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ధరించిన ఈ హుడి హ్యూగో బాస్ కంపెనీకి చెందింది.

దీని ధర విదేశాల్లో అయితే 245 డాలర్లుగా ఉంది. ఇది మన భారతీయ మార్కెట్లో రూ. 20వేల నుంచి రూ.27 వేల వరకు ఉంటుందని తెలియడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, పవన్ ప్రస్తుతం వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు వినోదయ సీతం అనే మరో తమిళ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వినోదయ సీతం అనే మరో తమిళ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

read also : సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం !

Visitors Are Also Reading