సీఎం పదవి అడుగుతా.. పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ పొత్తులపై పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాం, ఒప్పిస్తాం…ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ విషయం చర్చించానని తెలిపారు. 2019లో మేము 137 స్థానాల్లో పోటీ చేశామని వెల్లడించారు.
READ ALSO : Shakuntalam : ఒకరోజు ముందే ఓటిటిలోకి వచ్చేసిన “శాకుంతలం”… ఎందులో స్ట్రీమింగ్ అంటే!
Advertisement
మేము కనీసం కొన్ని స్థానాల్లో గెలిచి ఉంటే మేము నేడు బలంగా ఉండేవాళ్లమని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 30-40 స్థానాలు వచ్చి ఉంటే కర్నాటక తరహాలో పరిస్థితి ఉండేది… పొత్తులనేవి కులానికి సంబంధించినవి కాదు, రాష్ట్రానికి సంబంధించినవి అని వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే పొత్తుల గురించి నేను మాట్లాడాను… ఎర్లీ ఎలక్షన్స్ అని చెబుతున్నారు, జూన్ నుంచి ఇక్కడే ఉంటాను అన్నారు.
Advertisement
READ ALSO : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..పాక్ లో ఇంటర్నెట్, సోషల్ మీడియా “బ్లాక్”
గత ఎన్నికల కంటే మా బలం డబుల్ అయింది.. వ్యక్తిగత అవసరాల కోసం నేను పార్టీ ఏర్పాటు చేయలేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ నుంచి అధికారం తీసేసుకోవాలి.. ఇదే మా లక్ష్యమని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సీఎం కావాలనుకుంటే సీఎం అయిపోరు.. నన్ను సీఎంని చేయాలని టీడీపీనో.. బీజేపీనో అడగను.. నా సత్తా ఏంటో చూపించి అడుగుతాను అన్నారు పవన్ కల్యాణ్.
read also : చిరంజీవిది గొప్ప మనసు…”యముడికి మొగుడు” టైంలోనే ఆ పని చేశాడుగా…?