పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు వరుస సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా మంచి విజయం సాధించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదటి సారి పవన్ కళ్యాణ్ పీరియాడికల్ కథలో నటిస్తున్నారు.
Advertisement
ఇక ఈ చిత్రం తో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. మరో రెండు మూడు సినిమాలు కూడా పవన్ లైన్ లో పెట్టారు. ఇదిలా ఉంటే పవన్ పర్సనల్ లైఫ్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అప్పట్లో ఓ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి ఆయన తండ్రి వెంకట్రావు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Advertisement
పవన్ కళ్యాణ్ మనస్తత్వం మిగితా వాళ్లకు భిన్నంగా ఉండేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు తల్లితో, అన్న చిరంజీవి తో ఎక్కువ అనుబంధం ఉండేదని చెప్పారు. చిరంజీవి పెళ్లి సమయంలో పవన్ కళ్యాణ్ ఎంతో బాధపడ్డారు అని ఆయన తండ్రి చెప్పారు. పెళ్లి తరవాత పెద్దన్నయ్య తో ఇక సంబంధ బాంధవ్యాలు ఉండవేమో కదా అని తనతో చెబుతూ పవన్ బాధపడ్డాడు అని వెంకటరావు తెలిపారు.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ను ఇంటర్ తరవాత కూడా చదివిపించాలని చిరు అనుకున్నప్పటికీ నలుగురిలో కవలేక పోవడం వల్లనే చదువుకి దూరం అయ్యాడని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. రాజకీయంగా కూడా పవన్ రాణిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించి ప్రజాసమస్యల పై పోరాటం చేస్తున్నారు.